Breaking News

గత ప్రభుత్వంలో 11,782 లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం

Published on Thu, 06/20/2024 - 05:22

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం రాష్ట్రంలో 11,782 లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ­సా­­రథి చెప్పారు. ఐదేళ్లలో 6.8 లక్షల సాధా­రణ ఇళ్ల నిర్మా­ణం పూర్తి చేశారని, 1.05 లక్షల టిడ్కో ఇళ్లను మౌలిక సదుపా­యా­లతో పూర్తి చేసి లబ్ధి­దా­­రులకు అందజేసి­నట్టు వివరించారు.

 బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి పార్థసారథి విలేక­రులతో మాట్లా­డుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల అంశం కోర్టులో ఉంద­న్నారు. వైఎ­స్సా­ర్, జగనన్న కాల­నీల పేరు మార్పు­­పై ఆలోచించి నిర్ణయం తీసు­కుంటామ­న్నారు. ఇళ్ల నిర్మాణ పథకాన్ని కొనసాగిస్తామ­న్నారు. 

పేదలకు ఇళ్ల స్థలా­లకు సేకరించిన భూము­లను 2013 భూసే­కరణ చట్టం ప్రకా­రం సేకరించారో లేదో విచారణ జరుపుతా­మని, నిబంధనలు అతి­క్రమించినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో జర్న­లి­స్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రి­యను వేగ­వంతం చేసి సకాలంలో అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

లేదంటూనే.. అవునంటూ
అయితే వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూనే 11,782 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టిందని మంత్రి ఒప్పు­కున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31 లక్షలకుపైగా లబ్ధిదారులకు స్థలాలను అందించిన విషయం తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)