Breaking News

గ్రామీణ రహదారులకూ మహర్దశ

Published on Thu, 11/02/2023 - 04:42

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండే (హై ఇంపాక్ట్‌) మరో 202 రోడ్లను రూ.784.22 కోట్లతో పూర్తిస్థాయిలో మరమ్మతులతోపాటు పునర్నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 26 జిల్లాల్లో 1,035 కిలోమీటర్ల మేర ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలో 258 రోడ్లు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం పరిధిలో ఉండగా.. వాటిలో 56 రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం గతంలోనే అనుమతులు ఇవ్వగా.. పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 202 రోడ్ల పునర్నిర్మాణ పనుల కోసం పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. 

టెండర్ల ప్రక్రియ షురూ!
ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు ప్రక్రియను మొదలు పెట్టినట్టు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ ఈఎన్‌సీ బాలు నాయక్‌ తెలిపారు. 14 రోజుల పాటు టెండర్ల దాఖలుకు గడువు ఉంటుందని.. నవంబర్‌ నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్‌ మొదటి వారంలోనే ఆయా రోడ్ల పనులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. కాగా.. ఆర్‌ అండ్‌ బీ శాఖ పరిధిలో గుర్తించిన హై ఇంపాక్ట్‌ కేటగిరీ రోడ్లకు ప్రభుత్వం ఆ శాఖ ఆధ్వర్యంలో అనుమతులు మంజూరు చేసింది. ఆ పనులు కూడ మొదలైనట్టు అధికారులు వెల్లడించారు.

Videos

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)