Breaking News

షీర్‌ వాల్‌ టెక్నాలజీతో పేదల ఇళ్లు.. పైలెట్‌గా మోడల్‌ ఇళ్ల నిర్మాణం 

Published on Thu, 03/09/2023 - 10:33

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణంలో షీ­ర్‌ వాల్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే అవకా­శాలను పరిశీలిస్తున్నారు. నవరత్నాలు – పేదలంద­రికీ ఇళ్లు పథకం కింద 30 లక్షలకు పైగా గృహాల ని­ర్మాణాన్ని తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రెండు దశల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులివ్వగా ఇప్పటికే 17.22 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొన­సాగుతోంది. ఆప్షన్‌–3(ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఇళ్లు) గృహాల నిర్మాణానికి షీర్‌ వాల్‌ పరిజ్ఞానాన్ని వినియోగించటాన్ని గృహ నిర్మాణ శాఖ పరిశీలిస్తోంది.

అమలాపురం మున్సిపాలిటీలో..
లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ఇస్తున్న రూ.1.80 లక్షలు, అదనపు సాయం కింద బ్యాంక్‌ రుణం రూపంలో అందచేసే రూ.35 వేలతోనే షీర్‌ వాల్‌ పద్ధతిలో ఇళ్ల నిర్మాణానికి కొందరు నిర్మాణదారులు ముందుకొచ్చారు. వేగంగా ఇళ్ల నిర్మాణంతో పాటు భూకంపాలు, తుపాన్లను సైతం తట్టుకునేలా ఇంటి నిర్మాణం పూర్తవుతుండటంతో ఈ పరిజ్ఞానం వైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించిన బోడసకుర్రు వద్ద వైఎస్సార్‌ జగనన్న కాలనీలో కొఫియ గ్రూప్‌నకు చెందిన అజయ్‌హోమ్స్‌ అనే సంస్థ పైలట్‌గా షీర్‌ వాల్‌ పద్ధతిలో ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. నాణ్యతను పరీక్షించిన అనంతరం ఈ పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన లేఅవుట్లకు విస్తరించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్ణయించారు. షీర్‌ వాల్‌ పద్ధతిలో ఇటుకలు అవసరం లేకుండా సిమెంట్, కాంక్రీట్, ఇనుముతో కాంక్రీట్‌ గోడలు నిర్మిస్తారు.

ఉగాదికి ఐదు లక్షల ఇళ్లు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రెండు దశల్లో 17.22 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా ఇప్పటికే 3,00,986 గృహాల నిర్మాణం పూర్తయ్యింది. అ­త్య­ధికంగా విజయనగరం జిల్లాలో 25,573, చిత్తూరులో 25,072, పశ్చిమ గోదావరిలో 19,205 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గడువులోగా లక్ష్యాన్ని చేరుకునేలా నిర్మాణ పనులను వేగవంతం చేశారు.

నాణ్యత పరీక్షల అనంతరం..
షీర్‌ వాల్‌ పద్ధతిలో ఇళ్ల నిర్మాణానికి నిర్మాణదారులు ముందుకొస్తున్నారు. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో పైలెట్‌గా ఈ పద్ధతిలో ఒకటి రెండు ఇళ్లను నిర్మిస్తాం. వీటి నాణ్యతను పరీక్షించిన అనంతరం ఈ పద్ధతిని కొనసాగిస్తాం. 
– లక్ష్మి షా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ. 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)