Breaking News

పోలీసుకు న్యాయం కరువు

Published on Sun, 10/12/2025 - 05:56

అనంతపురం సెంట్రల్‌ : సామాన్య ప్రజలు అన్యా­యానికి గురైతే ఠక్కున గుర్తొచ్చేది పోలీసులు. అలాంటిది న్యాయం చేసే పోలీసుకే పోలీసు­స్టేషన్‌లో అన్యాయం జరుగుతోంది. తన భార్యపై దాడిచేసిన వారి మీద కేసు నమోదుచేయాలని రెండ్రోజులుగా ఓ కానిస్టేబుల్‌ పోలీసులను వేడుకుంటున్నా కనికరించడంలేదు. దాడికి పాల్పడిన వారు టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అను­చరులు కావడంతో చర్యలు తీసుకోవడానికి పో­లీసు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నా­రు. దీంతో కానిస్టేబుల్, అతని కుటుంబ సభ్యులు శనివారం అనంతపురం నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు.

వివరాలివీ..
అనంతపురం శ్రీనగర్‌ కాలనీ సమీపంలోని ఎలైట్‌ హోమ్స్‌లో పోలీసు డాగ్‌స్క్వాడ్‌లో పనిచేస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ హరినాథ్‌కుమార్‌ ఉంటున్నారు. కింది పోర్షన్‌లో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మేనల్లుడు తేజ సంబంధీకులు భువన్‌ చక్రవర్తి కుటుంబం ఉంటోంది. అయితే, శుక్రవారం సాయంత్రం హరినాథ్‌కుమార్, అతని స్నేహితుడు వాకింగ్‌కు వెళ్లారు. 

అదే సమయంలో.. పక్కింటి బాలుడు క్రికెట్‌ ఆడుకుంటూ బంతి వేయాలని వీరిని కోరాడు. దీంతో సదరు కానిస్టేబుల్‌ బంతి వేయడంతో బాలుడు బ్యాట్‌తో కొట్టాడు. బంతి భువన్‌ చక్రవర్తి కారుకు తగిలింది. దీంతో.. ఆయన దాదాపు 20 మంది ఎమ్మెల్యే అమిలినేని అనుచరులను తీసుకొచ్చి కానిస్టేబుల్‌ ఇంటిపై దాడిచేశారు. ఇక ఈ విషయంపై నాల్గవ పట్టణ సీఐ జగీదీష్‌ను వివరణ కోరగా.. ఇరు వర్గాలు ఘర్షణకు దిగారని.. కానిస్టేబుల్‌ భార్య సుజాత తమతో దురుసుగా ప్రవర్తించారంటూ భువన్‌ చక్రవర్తి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. 

స్టేషన్‌లో కూడా దాడి చేశారు
కానిస్టేబుల్‌ భార్య సుజాత మాట్లాడుతూ.. ‘మాకు న్యాయం చేయాలని స్టేషన్‌కు వస్తే అక్కడ కూడా వారు దాడిచేశారు. చెప్పుకోలేని మాటలు మాట్లాడారు. స్టేషన్‌లో శుక్రవారం రా­త్రి 2 గంటల వరకూ ఉన్నాం. శనివారం కూ­డా మ.2 గంటల వరకూ ఉన్నప్పటికీ పోలీ­సులు మాకు న్యాయం చేయలేదు. పైగా నీ ఉద్యోగం ఊడిపోతుంది.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో.. బట్టలు తీసుకుని కర్నూలు బందోబస్తుకు పో అంటూ నా భర్తను బెది­రిస్తు­న్నారు. 

పోలీసుశాఖలో పనిచేసి ఏం ఉప­యో­గం? ఇంత అవమానకరమైన బతుకు బత­కడం కంటే చావడమే మేలు. సీఎం సార్‌.. మ­మ్మ­ల్ని కాపాడండి. మా ప్రాణాలకు ఏమైనా జ­రి­గితే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుదే బా­­ధ్యత’.. అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా?
ఈ సందర్భంగా స్టేషన్‌ వద్ద హరినాథ్‌కుమార్‌ మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. ‘పోలీసు శాఖలో పనిచేస్తున్న నాకే రక్షణ లేకుండాపోతోంది. దాదాపు 20 మంది రౌడీలను నా ఇంటిపైకి తీసుకొచ్చి భువన్‌ చక్రవర్తి, అతని భార్య కళ్యాణి, చెల్లెలు అంజలి కలిసి నా భార్య సుజాతపై దాడిచేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని నాలుగో పట్టణ పోలీ­సుస్టే­షన్‌కు వచ్చి వేడుకున్నా. కేసు తీసుకోవడానికి సీఐ నిరాకరిస్తున్నారు. ఎందుకంటే వారి వెనుక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నారట. ఇక నేను పోలీసు ఉద్యోగం చేసి కూడా ఏం ప్రయోజనం? ఈ ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేస్తా’.. అని చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)