Breaking News

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి పోస్టింగ్‌ ఇవ్వాలి: డీవైఎఫ్‌ఐ

Published on Sat, 11/22/2025 - 05:17

సాక్షి, అమరావతి: పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు తక్షణమే శిక్షణ ఇచ్చి పోస్టింగ్‌ ఇవ్వాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, జి.రామన్న శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం 2022 నవంబరు 28న 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. అర్హత పరీక్షలో 95,208మంది అర్హత సాధించారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం 2025 జనవరి, ఫిబ్రవరిలో ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహించిందని, అందులో 40 వేల మంది అర్హత సాధించారని తెలిపారు. 

జూన్‌లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించి ఆగస్టులో రిజల్ట్స్‌ ఇచ్చారన్నారు. మెడికల్‌ టెస్ట్‌లు సైతం నిర్వహించి రెండు నెలలకుపైగా అయ్యిందన్నారు. ఇప్పటికే అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురౌతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆర్భాటం కోసం నిరుద్యోగులను ఇలా బలి చేయడం సరి కాదన్నారు. తక్షణమే ట్రైనింగ్‌ ఇచ్చి పోస్టింగ్‌ ఇవ్వాలని, లేని పక్షంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని రాము, రామన్న హెచ్చరించారు.   

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య