Breaking News

ఖాకీలో కామాంధుడు..? రైటర్‌ బాగోతం బట్టబయలు!

Published on Mon, 06/01/2026 - 12:01

ప్రకాశం: ఆమె ఒక మహిళా కానిస్టేబుల్, అతడు అదే పోలీసు స్టేషన్లో రైటర్‌. ప్రజలకు రక్షణ కలి్పంచాల్సిన సదరు రైటర్‌ బాధ్యతను విస్మరించి మహిళా కానిస్టేబుల్‌ తో అనుచితంగా ప్రవర్తించాడు. సాక్షాత్తు పోలీసు స్టేషన్లోనే జరిగిన ఈ ఘటనను ఎంత దాచి పెట్టాలనుకున్నా ఆ నోటా ఈ నోటా పడి గుప్పుమంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని అత్యంత ప్రధానమైన ఒక పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక రైటర్‌ మూడు రోజుల క్రితం అదే స్టేషన్లో పని చేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. 

దీంతో మనోవేదనకు గురైన మహిళా కానిస్టేబుల్‌ రైటర్‌ తీరుపై మండి పడటమే కాకుండా ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం బయటకు రాకుండా చూసేందుకు రంగంలోకి దిగిన అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆధ్వర్యంలోని ఒక వర్గం మహిళా కానిస్టేబుల్‌ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే కొంతకాలంగా రైటర్‌ వేధింపులతో విసుగు చెందిన కొందరు కానిస్టేబుళ్లు ఇదే అదనుగా ఈ ఘటనపై ఎస్పీ హర్షవర్ధన్‌ రాజుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో అసలు విషయం బట్ట బయలైంది. 

ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకున్న ఎస్పీ రైటర్‌ తోపాటు మహిళా కానిస్టేబుల్‌ ను కూడా వీఆర్‌ కు పంపించారు. అయితే రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని తన మీద వీఆర్‌ వేటు పడకుండా సదరు రైటర్‌ మెడికల్‌ లీవ్‌ పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. మహిళల రక్షణ కోసమంటూ ఎస్పీ దండయాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే మరోవైపు పోలీసు స్టేషన్లోనే మహిళా కానిస్టేబుల్‌ తో ఒక రైటర్‌ అనుచితంగా ప్రవర్తించడం దారుణమని పోలీసులు చెవులు కొరుక్కుంటున్నారు.  

తొలినుంచి అదే ధోరణి... 
మహిళా కానిస్టేబుల్‌ తో అనుచితంగా ప్రవర్తించిన సదరు రైటర్‌ పై తొలి నుంచి అనేక ఆరోపణలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో మద్దిపాడు పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌ గా విధులు నిర్వహించినప్పుడు అదే పోలీసు స్టేషన్లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ ఆయన మీద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన మీద వీఆర్‌ వేటు వేసి కొన్నాళ్లకు తాళ్లూరు పోలీసు స్టేషన్‌ కు బదిలీ చేశారు. అక్కడకు వచ్చిన తర్వాత ఒక సాధారణ మహిళను వేధించడం మొదలు పెట్టాడని, బాధిత మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందని, దాంతో ఆయనను మార్కాపురానికి బదిలీ చేశారు. 

మార్కాపురంలో ఒక మహిళా హోం గార్డు వెంట పడడం, అది కాస్త రచ్చ కావడంతో ఆయన్ను పామూరుకు బదిలీ చేశారని చెబుతున్నారు. అయితే అతడి వద్ద రైటింగ్‌ స్కిల్స్‌ ఉండటాన్ని గమనించిన ఒక సీఐ అతడ్ని సింగరాయకొండకు తెచ్చుకున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా పోలీసు శాఖలో చక్రం తిప్పిన పచ్చ పారీ్టకి చెందిన ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ సహకారంతో  మెమో మీద ఒంగోలుకు వచ్చినట్లు తెలుస్తోంది.

 ఆ తర్వాత ఇక్కడికే డీఓ తెచ్చుకున్నారు. అధికార పారీ్టలో ఉన్న పలుకుబడిని అడ్డం పెట్టుకొని ఒంగోలుకు వచ్చినప్పటి నుంచి ఓ మహిళా కానిస్టేబుల్‌ మీద కన్నేసి వేధిస్తున్నాడని, సీఐని గుప్పిట్లో పెట్టుకొని మిగతా సిబ్బందినీ ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా సదరు రైటర్‌ వేధింపుల పర్వం కొనసాగుతున్నా స్పెషల్‌ బ్రాంచి సిబ్బంది ఎస్పీ దృష్టికి తీసుకెళ్లలేదని, దాంతో అతడి ఆగడాలు మితిమీరిపోయాయని పోలీసులు గుసగుసలాడుతున్నారు. ఇప్పుడు కూడా అధికారులు తననేమీ చేయలేరని, త్వరలోనే అద్దంకికి వస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతోంది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)