Breaking News

పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో గందరగోళం!

Published on Sat, 05/31/2025 - 03:23

సాక్షి, అమరావతి: ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్‌–5, గ్రేడ్‌–6 (డిజిటల్‌ అసిస్టెంట్లు) పంచాయతీ కార్యదర్శుల బదిలీల విషయంలో తీవ్ర అస్పష్టత నెలకొంది. సంబంధిత శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సచివా­ల­యా­ల ఉ­ద్యో­­గులకు ప్రస్తుతం బదిలీలు లేవని ప్రకటించా­రు. 

అయితే, పంచాయతీరాజ్‌– గ్రామీ­ణాభివృద్ధి శా­ఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో మాత్రం పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్‌లు (5, 6) స్పష్టంగా ప్ర­స్తావించకుండా ఆదేశాలు జారీ చే­య­డం గందర­గోళానికి కారణమైంది. రెండు శాఖల మధ్య సమ­న్వయ లోపంతో దాదాపు 20 వేల మంది పంచా­యతీ కార్యదర్శుల బదిలీలపై అస్పష్టత నెలకొంది. 

చర్యలపై విభిన్న ధోరణులు
ఒకవైపు, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యా­లయం అన్ని జిల్లాల డీపీవోలు, జెడ్పీ సీఈవో­లతో మూడు రోజుల క్రితం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌­లో బది­లీకి సంబంధించిన అధికార ఉత్తర్వులు రాకపో­యినా, గ్రేడ్‌ 5, 6 ఉద్యోగుల దరఖాస్తులు స్వీకరించాలంటూ సూచనలు ఇచ్చింది. 

అదే సమయంలో, గ్రామ వార్డు సచివాలయాల శాఖ బదిలీలకు మినహాయింపు కల్పించాలని ప్రతిపా­దిస్తూ ప్రభు­త్వానికి ఫైల్‌ పంపినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై జీఓ విడుదల కాలేదు. ఈ గందరగోళం నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఆ­యా కేటగిరీల్లోని ఉద్యోగుల నుండి బదిలీ దరఖా­స్తులు మొదటినుంచి స్వీకరిస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో మాత్రం తాజాగా దరఖాస్తులు స్వీకరించినట్లు సమాచారం. 

ఉద్యోగుల్లో అయోమయం
రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుకు ముందు పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో నాలు­గు గ్రేడ్లలో పంచాయతీ కార్యదర్శులు బాధ్య­త­లు నిర్వహించేవారు. సచివాలయాల ఏర్పాటు సమ­యంలో కొత్తగా నియమాకాలు జరిగిన గ్రేడ్‌ 5, 6 పంచాయతీ కార్యదర్శులు ‘పంచా­యతీరాజ్‌ శా­ఖ’ ఉద్యోగులుగా సచివాల­యాల్లో పనిచేస్తు­న్నారు.

దీంతో ఆ రెండు కేటగిరి ఉద్యోగులు తమ­కు ఏ శాఖ ఆదేశాలు మేరకు బదిలీల ప్రక్రియ కొనసాగుతుందో తెలియక తికమక పడుతున్నా­రు.  అలానే, ఒక శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించాలంటూ సూచనలు చేయగా, మరో శా­ఖ ప్రభుత్వం వద్ద బదిలీల నిలుపుదలను ప్రతి­పాదించడంతో ఆఖరి నిమిషంలో ఏం జరుగు­తుందోనన్న సందేహం ఉద్యోగుల్లో నెలకొంది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)