Breaking News

సొంత రాజ్యాంగాలంటే.. కేసులు కట్టి జైల్లో పెట్టాలి

Published on Sat, 06/21/2025 - 04:08

సాక్షి, అమరావతి: ప్రతిఒక్కరి హక్కులు పరిరక్షించాలన్న ఆలోచనతోనే రాజ్యాంగం రాయాల్సి వచ్చిందని, సవివరణలతో కూడిన రాజ్యాంగం అమలులో ఉండగా కొత్తకొత్త రాజ్యాంగాలు, పుస్తకాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తోందని పలువురు వక్తలు ప్రశ్నించారు. ఒకరు రెడ్‌బుక్, ఇంకొకరు ఎల్లోబుక్, మరొకరు ఇంకో బుక్‌ అంటున్నారని.. ఈ రకమైన అదనపు రాజ్యాంగాల అవ­సరం ఎందుకొచ్చిందని వారు నిలదీశారు. రాజ్యాంగంపై ప్రమాణంచేసి అధికారం చేపట్టిన ప్రజాప్రతినిధులు రాజ్యాంగాలు ప్రయోగిస్తాం,  అమలుచేస్తామంటే.. అది కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన కింద­కు వస్తుందని, వీరిపై కేసులు నమోదుచేసి జైల్లో పెట్టాలని ముక్తకంఠంతో కోరారు.

ఆంధ్ర అడ్వకేట్స్‌ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవా­రం విజయవాడ ఐలాపురం హోటల్‌లో ‘మా­న­వ హక్కుల పరిరక్షణ–న్యాయవాదు­ల పాత్ర’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఫోరం రాష్ట్ర కనీ్వనర్‌ బి. అశోక్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్, ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యా­యమూర్తి జస్టిస్‌ బి. చంద్రకుమార్, విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు డాక్టర్‌ వసు­ంధర, మాజీ ఐఏఎస్‌ అధికారి, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి.విజ­య్‌కుమార్, హైకోర్టు న్యాయవాది మల­సాని మనో­హర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలపై పిల్‌ వేయాలి..
ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న వారంతా ప్రభుత్వోద్యోగుల బదిలీలకు లేఖలు ఇస్తున్నారు. వారికి అనువైన పోలీసులను వేసుకుంటున్నారు. నియోజకవర్గాన్ని సామ్రాజ్యంగా భావించి అక్కడున్న సహజ వనరులు ఎలా దోచుకోవాలి? అన్నదానికే వీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. నిజానికి.. ఎవరైనా ఒక అధికారి ఎమ్మెల్యే సిఫార్సు లేఖ తెచ్చుకుంటే అతన్ని సస్పెండ్‌ చెయ్యొచ్చు. అలాగే, ప్రజాప్రతినిధులు రాతపూర్వకంగా సిఫార్సు లేఖలిస్తున్నారు. ఇదొక్కటి చాలు ఎమ్మెల్యేలపై కేసు పెట్టడానికి. వీటిపై న్యాయవాదులు పిల్‌ వేయాలి. ఇక ఈ ఏడాది పాలనలో 766 హత్యాయత్నాలు జరిగితే వీటిలో 390 ఘటనలు రాజకీయపరమైనవే. 2,466 కేసుల్లో 500 మంది జైల్లో ఉన్నా­రు. సోషల్‌ మీడియాపై 440 కేసులు బనాయించగా.. 79 మంది జైళ్లలో ఉన్నారు. – విజయ్‌కుమార్, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి

నవ్వితే కేసు అంటే నవ్వొస్తోంది..  
టీవీ డిబేట్‌లో నవ్వితే జర్నలిస్టుపై కేసు పెట్టారని అంటే నవ్వొస్తోంది. ఈ కేసులో ప్రభుత్వ పరువు ఏమైంది? అసలీ వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా వచ్చింది? అధికారం మారితే పోలీసులు మారిపోతారా? పోలీసులే చంపుకుంటూపోతే ఇక హక్కుల గతేమిటి? హక్కులు పరిరక్షించుకుంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. కారణం లేకుండా ఏ వ్యక్తినీ నిర్బంధించకూడదు. తెనాలి ఘటన వంటి వాటిల్లో యువకులను కొట్టిన పోలీసులదే కాదు పైనున్న అధికారులదీ బాధ్యతే. ఈ సమాజంలో లాయర్లు, ప్రజలు ఫిఫ్త్‌ ఎస్టేట్‌. రైట్‌ టు ఎడ్యుకేషన్, ఫ్రీడమ్‌ టు స్పీచ్‌ లేకపోతే మన మనుగడ కష్టం. ప్రజల హక్కుల కోసం న్యాయవాదులు పోరాడకపోతే న్యాయవాదుల హక్కులు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.  – మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌  

 అణచివేత ఎల్లకాలం పనిచేయదు.. 
విజయవాడ ఒకప్పుడు రాజకీయ రాజధాని. ఎంతో ఉన్నతమైనది. అలాంటి చోట కులతత్వం పెరగడం విచారకరం. రా­ష్ట్ర­ంలో మహిళను చెట్టుకు కట్టేసి కొడుతుంటే.. యువకులను నడిరోడ్డుపై పడేసి కొడుతుంటే ఎవరూ స్పందించకపోతే భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించాలి. ముఖ్యంగా లాయర్లూ స్పందించకపోతే ఎలా? రాజకీయ నాయకులు యువతను ఎప్పుడూ మత్తులోనే ఉంచి వారి పబ్బం గడుపుకుంటున్నారు.

అణచివేసి రాజ్యమేలుతానంటే అది ఎల్లకాలం పనిచేయదు. స్వతంత్ర పోరా­టంలో న్యాయవాదులే ఎక్కువ. తెనాలి, కుప్పం వంటి ఘటనలపై సమాజం, న్యాయవాదులు స్పందించకపోతే చాలా ప్రమాదం. ప్రజల హక్కులను కాపాడే బాధ్యత న్యాయవాదులు తీసుకోవాలి. – జస్టిస్‌ బి. చంద్రకుమార్, ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

పీ4 విధానం అశాస్త్రీయమైనది.. 
ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 విధా­నం పూర్తిగా అశాస్త్రీయమైనది. ఇది పేద ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమే తప్ప మరొకటి కాదు. ఇలాంటి విషయాలను న్యాయవాదులు ఖండించాలి. – డాక్టర్‌ వసుంధర, విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)