షరతులతో రిటైర్మెంట్‌ వయస్సు పెంపు

Published on Fri, 07/03/2026 - 03:32

సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థలు, సొసై­టీలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లో 9, 10 షెడ్యూళ్లలో చేర్చిన సంస్థల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ పదవీ విరమణ పెంపునకు పలు షరతులు విధించింది. పదవీ విరమణ వయస్సు పెంపు 2022 జనవరి 1 నుంచి వర్తిస్తుందని తెలి­పి­ంది.

ఇప్పటికే 60 ఏళ్లకు పదవీ విరమణ చేసిన వారి­ని తిరిగి 62 ఏళ్ల వరకు విధుల్లోకి తీసుకోవా­లని,  అయితే పదవీ విరమణ, తిరిగి చేరే మధ్య కా­లాన్ని ఉద్యోగేతర కాలంగా పరిగణించి ఎలాంటి జీతం చెల్లించరని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సంస్థల ఆర్థిక పరిస్థితులు, అవసరం ఆధారంగానే పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసు­కోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిటైర్మెంట్‌పై ఆ సంస్థలు అనుసరించాల్సిన మార్గదర్శ­కాలు ఇవీ..

» 60 సంవత్సరాలు నిండిన తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులను, 62 సంవత్సరాల వరకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఇందుకు అనుగుణంగా ఆ సంస్థలు/సొసైటీలు/­కార్పొరే­షన్లు నిబంధనల్లో అవసరమైన సవరణలు చేయాలి.
»  కోర్టు ఉత్తర్వుల ఆధారంగా 62 సంవత్సరాల వయస్సు వరకు సర్వీసులో కొనసాగిన ఉద్యోగి, తత్ఫలితంగా వచ్చే అన్ని ప్రయోజనా­లతో పాటు క్రమబద్ధమైన సర్వీసును అందించినట్లుగా పరిగణించబడతారు. అటువంటి సంస్థల నిబంధనల ప్రకారం వర్తించే పింఛను ప్రయోజనాలు ఏవైనా ఉంటే, వాటిని తదనుగుణంగా ప్రాసెస్‌ చేయాలి.
»  ఇప్పటికే పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటే పదవీ విరమణ తేదీ నుండి తిరిగి విధుల్లోకి తీసుకున్న తేదీ వర­కు ఉన్న కాలాన్ని ఉద్యోగేతర కాలంగా పరిగ­ణి­ంచాలి. ఈ కాలంలో ఎలాంటి జీతం చెల్లించరు.
» అయితే, వార్షిక గ్రేడ్‌ ఇంక్రిమెంట్‌ విడుదల కోసం ఉద్యోగేతర కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంక్రిమెంట్‌ ప్రయోజనం తిరిగి విధుల్లోకి తీసుకున్న తేదీ నుంచి మాత్రమే వర్తిస్తుంది. సీనియారిటీ, పదోన్నతులు మొద­లైన వాటి కోసం ఈ కాలాన్ని లెక్కించాలి. పింఛను అర్హత గల సంస్థల్లో ఈ కాలంలో పొందుతున్న పింఛన్‌ను కొనసాగించవచ్చు.
» తిరిగి విధుల్లో చేరిన ఉద్యోగులు పదవీ విర­మణ తరువాత పొందిన పింఛను ప్రయో­జనాలను, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవుల నగదును తిరిగిసంస్థలకు చెల్లించాలి.
»  60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసి, తిరిగి విధుల్లో చేరడానికి ఆసక్తి లేని ఉద్యోగుల రిటైర్మెంట్‌ను నిబంధనల ప్రకారం అనుమతించవచ్చు.
» రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీల్లో ఉద్యోగుల అవసరం వాస్తవికత, ఈ సొసైటీల పనితీరు అంచ­నా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. బడ్జెట్‌ అవ­సరాల కోసం ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)