Breaking News

ముగిసిన మలబార్‌–2024 విన్యాసాలు

Published on Sun, 10/20/2024 - 05:05

సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ఈ నెల 8న ప్రారంభమైన మలబార్‌–2024 విన్యాసాలు శనివారం ముగిశాయి. హార్బర్, సీ ఫేజ్‌లో మొత్తం రెండు దశల్లో విన్యాసాలు జరిగాయి. భారత నౌకాదళంతో పాటు యునైటెడ్‌ స్టేట్స్‌ నేవీ (యూఎస్‌ఎన్‌), జపాన్‌ మేరీటైమ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (జెఎంఎస్‌డీఎఫ్‌), రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ (ఆర్‌ఏఎన్‌) నౌకాదళాలు సీ ఫేజ్‌లో నిర్వహించిన సముద్ర ఉపరితల, గగన తల విన్యాసాలు శత్రుదేశాలకు హెచ్చరికలు పంపినట్లుగా సాగాయి.

 చివరి రోజున బంగాళాఖాతంలో యాంటీ సబ్‌ మెరైన్‌ వార్‌ఫేర్‌ ఆపరేషన్స్, క్రాస్‌డెక్‌ ల్యాండింగ్స్, సీమ్యాన్‌ షిప్‌ విన్యాసాలు జరిగాయి. విన్యాసాలు ఆద్యంతం అలరించాయి. అనంతరం నాలుగు దేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో ముగింపు సమావేశం జరిగింది. ఏ సమస్య వచ్చినా.. కలిసి ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతికత, శిక్షణ, అవగాహన, సహకారం తదితర అంశాలపై కలిసి పనిచేయాలని తీర్మానిస్తూ.. మలబార్‌–2024కి వీడ్కోలు పలికారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)