Breaking News

ముందు టార్గెట్లు.. తర్వాత రికవరీలు

Published on Sat, 04/12/2025 - 04:24

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది పరిస్థితి ‘ముందు నుయ్యి... వెనుక గొయ్యి..’ అన్న చందంగా మారిందని ఉద్యోగుల జేఏసీ ఆందోళన వ్యక్తంచేసింది. ఉపాధి హామీ పథకం అమలులో మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పనిచేసే టెక్నికల్‌ అసిస్టెంట్‌(టీఏ), ఏపీవో, ఈసీ, జేఈ, ఎంటీసీ, ఏపీడీ, బీఎఫ్‌టీ తదితర కేటగిరీ ఉద్యోగ సంఘాల జేఏసీ సభ్యులు శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయంలో సమావేశమయ్యారు. 

‘ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా మొదట కూలీల రోజు­వారీ వేతనం గరిష్ట మొత్తంలో ఉండాలని టార్గెట్లు పెడుతున్నారు. పనులు పూర్తయిన తర్వాత విజిలెన్స్‌ విచారణ, సోషల్‌ ఆడిట్‌ పేరుతో చేసిన పని కంటే కూలీలకు ఎక్కువ మొత్తంలో వేతనాల బిల్లులు నమోదు చేశారంటూ ఉద్యోగుల జీతాల నుంచి రికవరీకి సిఫార్సులు చేస్తున్నారు..’ అని ఉద్యోగుల జేఏసీ నాయకులు తప్పుపట్టారు. ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న దాదాపు 7వేల మందికి ఉద్యోగ భద్రత కొరవడిందని ఆందోళన వ్యక్తంచేశారు. 

కేటగిరీల వారీగా ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు గ్రేడ్‌ ఫిక్స్‌ చేయాలని, 23 శాతం పీఆర్సీ వర్తింపజేయాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్, నగదు రహిత హెల్త్‌ కార్డులు ఇవ్వాలని జేఏసీ తీర్మానించింది. సమావేశం అనంతరం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ, ఉపాధి హామీ పథకం అమలు డైరెక్టర్‌ షణ్ముఖ్‌కుమార్‌లను జేఏసీ ప్రతినిధులు కలిసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. ఈ నెలాఖరు నాటికి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని, లేకపోతే ఉద్యోగులందరం ఐక్యంగా పోరాటం సాగిస్తామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు.    

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)