Breaking News

ఈ ‘శిక్ష’ణ మాకొద్దు

Published on Fri, 11/08/2024 - 04:46

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు ఉపాధ్యాయులకు ఇస్తు­న్న ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) రెసిడెన్షియల్‌ శిక్షణపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తమకు స్థానికంగా శిక్షణ ఇవ్వాలని చెప్పినా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం ఆగిరిపల్లిలో శిక్షణ కోసం వచ్చిన ఉపా«­ద్యాయుడు మృతి చెందడం, చీరాలలో మరో ఉపాధ్యాయుడు అస్వస్తతకు గురవడంతో ఈ శిక్షణ­ను పూర్తిగా బహిష్కరించాలని భావిస్తున్నా­యి.

ఉపాధ్యాయులపై ఉన్న భారాన్ని తొలగి­స్తా­మని, యాప్స్, శిక్షణ అంశాలను తొలగిస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు హామీ­లు ఇచ్చారని, కానీ గతం కంటే ఇప్పుడు పని ఒత్తి­డి అధికంగా పెంచారని ఉపాధ్యాయులు చెబుతు­న్నారు. ప్రపంచ బ్యాంకు నిబంధనలను తమపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపి­స్తున్నారు. 50 ఏళ్ల వయసు పైబడిన వారికి శిక్షణ నుంచి మినహాయించాలన్నా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని, దీనిపై ఒకటి రెండు రోజుల్లో పాఠశాల విద్య డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేసి తమకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే శిక్షణను బహిష్కరిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. 

విద్యా ప్రమాణాల పెంపునకు శిక్షణ
విద్యాబోధనలో ప్రమాణాలు పెంచాలంటే ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఉండాలని జాతీయ విద్యా విధానానికి, నిపుణ్‌ భారత్‌ ప్రోగ్రామ్‌కు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణను ప్రారంభించింది. ఈ శిక్షణ ద్వారా 1, 2 తరగతులపై దృష్టి సారించి, 3 నుంచి 8 సంవత్సరాల వయసు పిల్లలకు నాణ్యమైన విద్యను అందచడమే లక్ష్యంగా కోర్సుకు రూపకల్పన చేశారు. మొత్తం 34 వేల మంది గ్రేడ్‌–1, 2 కేటగిరీ ఉపాధ్యాయులకు 14 విడతల్లో ఈ శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. గతేడాది కూడా ఇదే తరహా శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా 9 కేంద్రాల్లో దాదాపు 4 వేల మందికి, ఈ ఏడాది తొలివిడత 1,700 మందికి శిక్షణ ఇచ్చారు.

అయి­తే, అప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. గతేడాది పిల్లలను బడిలో చేర్పించడం, బడి బయటి పిల్లలను సర్వే చేయడం, వారిని బడికి తీసుకొచ్చే బాధ్యతను వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది తీసుకున్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల చేరికల కోసం ఇంటింటి సర్వే ఉపాధ్యాయులే చేయాల్సి వచ్చింది. దీంతోపాటు పదో తరగతి విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ సిద్ధం చేయడం, కొత్తగా అపార్‌ ఐడీల నమోదు వంటి అదనపు భారం తమపై పడిందని, దీంతో తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Videos

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)