Breaking News

రోడ్డెక్కిన పత్తి రైతు

Published on Tue, 11/19/2024 - 03:40

నాదెండ్ల: కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులకు మద్దతు ధర లభించటం లేదని, సాకులు చెబుతూ పత్తిని కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారంటూ సోమ­వారం రైతులు రోడ్డెక్కారు. పల్నాడు జిల్లా గణపవరంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న వెంకటకృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌లో ఇటీవల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. 

నిబంధనల పేరుతో 90 శాతం పత్తి లోడులను తిరస్కరిస్తున్నా­రంటూ రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి.. పత్తి లోడు ట్రాక్టర్లను జాతీయ రహదారికి అడ్డంగా నిలిపి దిగ్బంధనం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. తేమ 12 శాతం మించిందని, పత్తిలో కాయ ఉందని, తడిసిపోయిందంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

పత్తి కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజు కూడా రైతులకు న్యాయం జరగలేదని వాపోయారు. గత ప్రభుత్వంలో సీసీఐ కొనుగోలు కేంద్రంలో రైతులకు పూర్తిగా న్యాయం జరిగిందని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి ఎకరాకు 2–3 క్వింటాళ్ల మేర దిగు­బడి నష్టపోయామని, కూలి ధరలు పెరిగి సాగు భారంగా మారిందన్నారు. 

రైతులు ఆందోళనకు దిగారన్న సమాచారంతో రూరల్‌ సీఐ సుబ్బానాయుడు సిబ్బందితో చేరుకుని రైతులతో మాటా­్లడారు. సీఐ తాను ఉన్నతాధికారులతో మాట్లా­డతానని సర్దిచెప్పి ఆందోళన విరమింపచేశారు. అనంతరం సీసీఐ బయ్యర్‌ రమే ష్ బాబు, రైతులతో సంప్రదింపులు చేశారు. 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు