ఏపీలో 98% మందికి బ్యాంకు ఖాతాలు

Published on Sun, 10/20/2024 - 05:39

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 18 ఏళ్లు నిండిన వారిలో 98 శాతం మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. జాతీయ సగటును మించి ఏపీలో బ్యాంకు అకౌంట్లు ఉండటం విశేషం. జాతీయంగా సగటున 94.6 శాతం మందికే బ్యాంకు ఖాతాలున్నాయి. సమగ్ర వార్షిక మాడ్యులర్‌ సర్వే–2022–­23 వివరాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. 

వివిధ రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళల్లో ఎంత మందికి వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల్లో ఖాతాలున్నాయో సర్వే వెల్లడించింది. అత్యధికంగా బ్యాంకు ఖాతాలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉండగా.. మొదటి స్థానంలో కర్ణాటక, ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌ ఉన్నాయి. అత్యల్పంగా బ్యాంకు ఖాతాలు మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, గుజరాత్‌లో ఉన్నట్టు సర్వే పేర్కొంది. 

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో సమానంగా మహిళలకు బ్యాంకు ఖాతాలున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనూ కొద్దిపాటి తేడాతో ఇదే పరిస్థితి. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణాల్లో కలిపి పురుషులకు 98.1 శాతం బ్యాంకు ఖాతాలుండగా, మహిళలకు 97.9 శాతం ఉన్నాయి. ఇదే జాతీయ సగటున గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి పురుషులకు 96.2 శాతం ఉండగా, మహిళలకు 92.8 శాతం బ్యాంకు ఖాతాలున్నాయి. 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)