Breaking News

దాతృత్వంలో పెద్ద చెయ్యే..

Published on Sat, 05/03/2025 - 04:23

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: కార్పొరేట్‌ సామా జిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా కంపెనీలు తమ దాతృత్వాన్ని చాటు కుంటున్నాయి. కంపెనీలు ఏటా ఇందుకోసం వెచ్చిస్తున్న మొత్తం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022–23లో  దేశ వ్యాప్తంగా 24,392 సంస్థలు సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలకు రూ.29,987 కోట్లు ఖర్చు చేశాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 12.8% ఎక్కువ. 

ఈ కంపెనీలు దేశ వ్యాప్తంగా మొత్తం 51,966 ప్రాజెక్టులు చేప ట్టాయి. 2021–22లో 19,888 కంపెనీలు రూ.26,580 కోట్లు ఖర్చు చేశాయి. అయితే 2022– 23లో 55.6% కంపెనీలు నిర్దేశిత మొత్తాన్ని మించి వ్యయం చేసిదాతృత్వంలో తమది పెద్ద చేయి అనిపించుకు­న్నాయి. సామాజిక బాధ్యతగా పేదవారి చదువుకే సంస్థలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. 

పెద్ద చేయి విస్తరిస్తోంది..
2022–23లో మొత్తం సీఎస్‌ఆర్‌ ఫండింగ్‌లో ప్రైవేటు సంస్థల వాటా ఏకంగా 86%. 13,571 కంపెనీలు నిర్దే శిత మొత్తం కంటే ఎక్కువగా వెచ్చించడం విశేషం. 2017– 18లో ఇటువంటి కంపెనీల సంఖ్య 4,945 మాత్రమే. నిర్దేశిత మొత్తాన్ని మించి సీఎస్‌ఆర్‌కు  విరివిగా ఖర్చు చేస్తున్న టాప్‌– 10 సంస్థల్లో రిల యన్స్‌ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, ఐఓసీఎల్, మహానది కోల్‌ఫీల్డ్స్, గెయిల్‌ ఇండియా, విప్రో, ఎన్‌టీపీసీ, వేదాంత, మారుతీ సుజుకీ ఇండియా ముందున్నా యి. 

నిర్దేశిత మొత్తం వ్యయం చేసిన కంపెనీలు 1,622. ఇక, రూపాయి కూడా విదిలించని కంపెనీల సంఖ్య 11,748 నుంచి 810కి దిగిరావడం శుభపరిణామం. సంస్థలు ఆర్జిస్తున్న లాభాల్లో మెరుగైన వృద్ధి సీఎస్‌ఆర్‌ నిధుల పెరుగుదలకు దోహదం చేస్తోంది. ఇక సీఎస్‌ఆర్‌లో భాగంగా 2022–23లో మూడు సంస్థలు రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేశాయి. 37 కంపెనీలు రూ.100–500 కోట్లు, 337 సంస్థలు రూ.10–100 కోట్లు వెచ్చించాయి.  కంపెనీలు పేదల విద్య కోసం అత్యధికంగా రూ.10,086 కోట్లు వెచ్చించాయి. ఆరోగ్య సంరక్షణకు రూ.6,830 కోట్లు ఖర్చు చేశాయి.

ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలు..
అన్‌లిస్టెడ్‌తో పోలిస్తే లిస్టెడ్‌ కంపెనీలే సీఎస్‌ఆర్‌లో ముందంజలో ఉన్నాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో (ఎన్‌ఎస్‌ఈ) నమోదైన 1,394 సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తం రూ.17,967 కోట్లు. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం 15.7%అధికం. వీటిలో 66 ప్రభుత్వ సంస్థలు చేసిన వ్యయాలు అంత క్రితం ఏడా దితో పోలిస్తే 19% ఎగసి రూ.3,717 కోట్లకు చేరాయి. 2022–23లో 56 ప్రభుత్వ కంపెనీలు రూ.3,136 కోట్లు వెచ్చించాయి. 544 సంస్థలు విద్య కోసం రూ.1,104 కోట్లు ఖర్చు పెట్టాయి. ఆ తర్వాత ఆహారం, పేదరిక నిర్మూ లన, ఆరోగ్యం కోసం రూ.720 కోట్లు ఖర్చు పెట్టాయి. 

సీఎస్‌ఆర్‌ చట్టం ఏం చెబుతోందంటే..
2014 ఏప్రిల్‌లో అమలులోకి వచ్చిన కార్పొరేట్‌ సామాజిక బాధ్యత చట్టం ప్రకారం ఒక కంపెనీ రూ.500 కోట్ల విలువ కలిగి.. రూ.1,000 కోట్ల ఆదా యం లేదా రూ.5 కోట్ల నికరలాభం గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జిస్తే.. అంత క్రితం మూడు ఆర్థిక సంవత్సరాల్లో పొందిన లాభాల్లో సగటు మొత్తంపై 2% తప్పనిసరిగా సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలకు వెచ్చించాలి. 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)