Breaking News

టైగర్‌పై సిండికేట్‌ పంజా..

Published on Thu, 07/03/2025 - 03:13

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకా­నికి తోడు సిండ్‌కేట్‌గా మారిన కంపెనీల దెబ్బకు ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. ఇప్పటికే వెనామీ రొయ్య ధరలు దిగజారిపోగా, తాజాగా టైగర్‌ (నీలకంఠ) రొయ్యల ధరలు తగ్గించేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కసారిగా కౌంట్‌కు రూ.80 తగ్గించడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. వైట్‌స్పాట్,  వెబ్రియా వంటి వైరస్‌లకు తోడు అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదొడుకుల సాకుతో ధరలు తగ్గి, తీవ్ర నష్టాల పాలైన వెనామీ రైతులకు టైగర్‌ ప్రత్యామ్నాయంగా మారింది.  

వెనామీ తరహాలోనే ఎప్‌సీఎఫ్‌ టైగర్‌ బ్రూడర్స్‌ అందుబాటులోకి రావడంతో వెనామీకి ప్రత్యామ్నాయంగా 2021 నుంచి రాష్ట్రంలో టైగర్‌ రొయ్యల సాగు విస్తరిస్తోంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో  50 నుంచి 60 వేల ఎకరాల్లో టైగర్‌ రొయ్య సాగవుతుంది. వ్యాధుల బారిన పడకుండా రోజూ 0.3 గ్రాముల నుంచి 0.5 గ్రాముల ఎదుగుదలతో కేవలం 120 రోజుల్లోనే 20 కౌంట్‌ వద్ద పంట చేతికి కొస్తుంది. టైగర్‌ రొయ్య వెనామీకి దీటుగా అమెరికా, యూరప్, గల్ఫ్‌ దేశాలకు ఎగుమతవుతున్నాయి. దీంతో వీటిని సాగు చేసే రైతులు నాలుగైదేళ్లుగా మంచి లాభాలే చవిచూస్తున్నారు. 

అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం విధించిన ప్రతీకార పన్ను సాకుతో రొయ్యల కంపెనీలు, ఎగుమతిదారులు రొయ్యల కౌంట్‌ ధరలను తగ్గించేసారు. వెనామీ రొయ్యల ధరలు కౌంట్‌కు రూ.20 నుంచి రూ.50 మేర పతనమైనప్పటికీ టైగర్‌ రొయ్యల ధరలు కాస్త మెరుగ్గానే కొనసాగాయి. అలాంటిది ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో కంపెనీలు సిండికేట్‌ అయిపోయి ఉన్నట్టుండి కౌంట్‌కు రూ.80 మేర తగ్గించేయడం టైగర్‌ రొయ్య రైతులకు శాపంగా మారింది. సాధారణంగా టైగర్‌ రొయ్యలు 20–40 కౌంట్‌ వద్దే పట్టుబడి పడుతుంటారు. 

మొన్నటి వరకు 20 కౌంట్‌ వద్ద పట్టుబడి పడితే రూ.650, 30 కౌంట్‌కు రూ.580, 40 కౌంట్‌కు రూ.480 చొప్పున ధర లభించింది. అలాంటిది ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో అధికంగా పట్టుబడి పట్టే 30 కౌంట్‌ ధరను రూ.500కు, 40 కౌంట్‌ ధరను రూ.400కు తగ్గించేశారు. కంపెనీలను నియంత్రించి, రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదు.

వెనామీతో పోల్చుకుంటే టైగర్‌ రొయ్యల సాగుకు పెట్టుబడి అధికం. వెనామీ పిల్ల 30–32 పైసల మధ్య లభిస్తుండగా, టైగర్‌ రొయ్య పిల్ల ధర రూపాయి పైమాటే. పైగా మేత ధర కూడా వెనామితో పోల్చుకుంటే కిలోకు రూ.10–15 అధికంగా పెట్టాలి. ఎకరాకు 5.50 లక్షలు ఖర్చవుతుంది. 20 కౌంట్‌కు పడితే 2 టన్నులు, 30 కౌంట్‌కు పడితే టన్నున్నర, 40 కౌంట్‌ అయితే టన్నుకు మించి రాదు. అలాంటిది కిలోకు రూ.80 తగ్గించడంతో టన్నుకు రూ.80 వేల మేర రైతులు నష్టపోతున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కంపెనీల మాయాజాలం
అంతర్జాతీయ మార్కెట్‌­లో ఎలాంటి ఒడిదొ­డు­కులు లేవు. టైగర్‌ రొయ్యలు ఎగుమతి అయ్యే దేశాల్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు తలెత్త­లేదు. పైగా ఆ దేశాల్లో వీటికి ఎనలేని డిమాండ్‌ ఉంది. ఆర్డర్లు కూడా బాగానే వస్తున్నాయి. అయినా కంపెనీలు సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో కౌంట్‌కు రూ.80కుపైగా తగ్గించడం దారుణం. ప్రభుత్వమూ పట్టించుకోవడంలేదు.  – దుగ్గినేని గోపీనాథ్, అధ్యక్షుడు, రొయ్య రైతుల సంఘం, ప్రకాశం జిల్లా

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)