Breaking News

పౌర సరఫరా సంస్థలో ఆమ్యామ్యాల రాజ్యం

Published on Thu, 10/23/2025 - 05:08

సాక్షి, అమరావతి: రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో వ­సూళ్ల రాజ్యం నడుస్తోంది. రాజకీయ సిఫారసు­లు, అవినీతి కాసులే పరమావధిగా వ్యవస్థ పనితీరు దిగజారింది. అమా­­త్యుల ఆదేశాలతో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారి­ని కూటమి ప్రభుత్వం అందలం ఎక్కించింది. ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాల్లోను ఇదేరీతిలో బదిలీలు చేపట్టడంతో వసూళ్లు మూడుపు­వ్వులు, ఆరుకాయ­లుగా సాగుతున్నాయి. ఇప్పు­డు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)కు బిల్లుల చెల్లింపులో అవినీతి బహిర్గతమైంది. పీడీ­ఎస్‌ బియ్యం సేకరణలో భాగ­ంగా ప్రభుత్వం ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఆ ధాన్యాన్ని మిల్లులకు తరలించి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) చేయిస్తుంది.

దీనికిగాను ఏటా మిల్ల­ర్లకు రూ.­1,200 కోట్ల వరకు చెల్లి­స్తుంది. ఆయా సీజన్లు ముగిసిన తర్వాత పౌరసరఫరాల సంస్థ ఎండీ బిల్లుల చెల్లింపునకు సర్క్యులర్‌ ఇచి్చన అనంతరమే ఈ బిల్లులు పెట్టాలి. నిధుల లభ్యతను బట్టి ఎండీ ఆదేశాలతోనే చెల్లించాలి. కానీ కొందరు ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ఇష్టారీతిన చెల్లించేస్తు­న్నా­రు. సీఎంఆర్‌ 2023–24కు సంబంధించి చెల్లింపులకు గతే­డాది ఆగస్టు–సెపె్టంబర్‌లో ఎండీ స­ర్క్యు­­లర్‌ జారీచేయడంతో రాష్ట్ర­వ్యాప్తంగా మిల్లర్లు బిల్లు­లను ఆప్‌లోడ్‌ చేశారు. నిధులు లేకపోవడంతో చెల్లి­ంపు­లు ఆలస్యమయ్యా­యి.

ఇటీవల మార్కె­ఫెడ్‌ ద్వారా పౌరసరఫరాల సం­స్థకు రూ.వెయ్యికోట్ల అప్పు అందింది. 2023–24 సీఎంఆర్‌ బిల్లుల చెల్లింపులకు ఎండీ ఆ­దేశించారు. ఏపీలో చాలామంది మిల్లర్లకు బిల్లులు చెల్లించారు. గుంటూరు జిల్లాలో మాత్రం పొన్నూరుకు చెందిన ఒక మిల్లరుకే డబ్బు జమచేశారు. దీనికి స్థానిక పౌరసరఫరాల సంస్థ అధికారి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. గతంలో ప్రధాన కా­ర్యా­లయానికి ఆ ఒక్క మిల్లరు బిల్లును విడిగా పెట్టి, మిగిలిన మిల్లర్ల బిల్లులను కలిపి పె­ట్టించారు. కలిపి పెట్టిన బిల్లులను పలు కారణాలతో రిజెక్టు చేయించి సింగిల్‌గా పెట్టిన బిల్లులకు డబ్బులిచ్చేశారు.  

అడ్వాన్స్‌ రూపంలో చెల్లింపులు  
గుంటూరు జిల్లాలో 28 మిల్లులున్నాయి. వీటిలో పొన్నూరుకు చెందిన మిల్లర్‌కు మా­త్రమే రెండు, మూడునెలల కిందటే అడ్వా­న్సుగా రూ.20 లక్షలకుపైనే ఇచ్చేశారు. ఎండీ ఆదేశాలతో పనిలేకుండా ప్రధాన కార్యా­లయంలోని ఫైనాన్స్‌ అధికారులతో కుమ్మకైన గుంటూరు అధికారి గుట్టుచప్పుడు కాకుండా ఈ అడ్వాన్స్‌ని ఇప్పించడం గమనార్హం. ఇంతటితో ఆగకుండా 2024–25 సీఎంఆర్‌ నిధుల చెల్లింపులకు ఎండీ సర్క్యులర్‌ రానప్పటికీ, పాత పద్ధతిలోనే పొన్నూరు మిల్లర్‌కు మరో రూ.80 లక్షల వరకు అ­డ్వాన్స్‌ ఇప్పించినట్టు సమాచారం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)