Breaking News

మంత్రి నాదెండ్లకు షాక్‌.. పోర్టులో బియ్యానికి క్లీన్‌ చిట్‌

Published on Sun, 01/05/2025 - 09:17

సాక్షి, విశాఖ: ఏపీలో మంత్రి నాదెండ్ల మనోహర్‌(Nadendla Manohar)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి తాజాగా కలెక్టర్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ పట్టుకున్న బియ్యం రేపోమాపో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఏపీ(Andhra Pradesh)లో కూటమి సర్కార్‌ పాలన హడావుడికి ఎక్కువ పని తక్కువ అన్న చందంగా తయారైంది. మంత్రులు కనీస అవగాహన కూడా లేకుండా ఓవరాక్షన్‌ చేస్తున్నారు. తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చుక్కెదురైంది. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు.  గత నెల 9న కంటైనర్ టెర్మినల్‌లో నాదెండ్ల తనిఖీలు చేశారు. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్‌లో 259 టన్నుల రేషన్ బియ్యం గుర్తించినట్లు నాదెండ్ల ప్రకటించారు.

ఇదే సమయంలో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బియ్యం తీసుకొచ్చిన సంస్థపై కేసు నమోదు చేసినట్లు మంత్రి హడావిడి చేశారు. ఇక, నెల రోజుల తర్వాత అవి రేషన్ బియ్యం కాదంటూ కలెక్టర్‌ ధృవీకరించారు. ఈ క్రమంలో వాటిని బిబో సంస్థకి ఎగుమతి కోసం అప్పగిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. మంత్రి అనుచరులు బియ్యాన్ని విడిచిపెట్టాలంటూ కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. కాగా, బియ్యం రేపోమాపో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)