Breaking News

మన్యంలో విరగ్గాసిన కాఫీ

Published on Sun, 06/22/2025 - 05:39

నాణ్యమైన ఆర్గానిక్‌ కాఫీ పంటగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన మన్యం కాఫీ తోటలకు ఈ ఏడాది అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి. ఎన్నడూలేని రీతిలో 45 రోజుల ముందుగానే ఈ తోటలు పిందెలతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి కురిసిన వర్షాలు అనుకూలించడంతో కాఫీ మొక్కలు విరగ్గాశాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ప్రస్తుతం ఏజెన్సీ వ్యాప్తంగా 1.55 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడాది కూడా మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశతో ఉన్నారు. – సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)

పోటా పోటీగా కొనుగోళ్లు
ఇక గత ఏడాది 1.48 లక్షల ఎకరాల్లో సుమారు 17 వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజల దిగుబడి వచ్చింది. జీసీసీతో పాటు ప్రైవేట్‌ సంస్థలు పోటాపోటీగా దీనిని కొనుగోలు చేశాయి. గిరిజన రైతులంతా కిలో పాచ్‌మెంట్‌ కాఫీ గింజలను రూ.450 ధరకు అమ్ముకున్నారు. బెంగళూరు మార్కెట్‌లో కిలో రూ.550 ధరతో వ్యాపారం జరిగింది. ప్రతీ రైతు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70వేల వరకు ఆదాయం పొందారు. ఈ ఏడాది అదనంగా మరో ఏడువేల ఎకరాల కొత్త తోటలకు తొలిసారిగా కాపు వచ్చింది. సుమారు 19 వేల టన్నుల వరకు దిగుబడి పెరిగే పరిస్థితులు ఉన్నాయి. కాపు అధికంగా ఉండడంతో గిరిజన రైతులంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

ఈసారి దిగుబడి ఎక్కువగా ఉండొచ్చు 
ఈసారి కాఫీ తోటలకు అధిక వర్షాలు ఎంతో మేలుచేశాయి. గింజ దశ ముందుగానే రావడంతో పాటు కాపు కూడా అధికంగానే ఉంది. ఈ ఏడాది కొత్త తోటలకు కూడా తొలిసారిగా కాపు వచ్చింది. గత ఏడాది కన్నా దిగుబడి అధికంగా ఉండొచ్చని భావిస్తున్నాం.  –పాలికి లక్కు, కాఫీ రైతుల సంక్షేమ సంఘం, పాడేరు 

బాగా ముందుగానే కాపు 
జూన్‌లోనే కాఫీ మొక్కలకు పిందె ఏర్పడటం తొలిసారిగా చూస్తున్నాం. సాధారణంగా ఆగస్టులో గింజ దశ ఏర్పడేది. అయితే, ఈ ఏడాది కాఫీ పూలు కూడా ముందుగానే వికసించాయి. అధిక వర్షాలు కాఫీతోటలకు మేలుచేశాయి. దిగుబడి, ధర బాగుంటే మేలు జరుగుతుంది.          – గోరపల్లి నారాయణమ్మ, మహిళా కాఫీ రైతు, బరిసింగి, పాడేరు మండలం 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)