Breaking News

కొబ్బరి అధరహో..

Published on Tue, 05/27/2025 - 03:02

సాక్షి, అమలాపురం/అంబాజీపేట: శ్రీరామ నవమి నుంచి వినాయక చవితి వరకూ కోనసీమ జిల్లా అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌కు అన్‌సీజన్‌. చవితి పండుగకు నెల రోజుల ముందు నుంచి కొనుగోలు సీజన్‌ మొదలవుతుంది. అటువంటిది అన్‌ సీజన్‌లో కొబ్బరి ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఒకవైపు పచ్చి కొబ్బరికాయ ధర పెరగగా.. మరోవైపు కురిడీ కొబ్బరి రికార్డు స్థాయికి చేరడం గమనార్హం. ఒక్కసారిగా ధరలు పెరగడంతో మార్కెట్‌కు కొత్త జోష్‌ వచ్చింది.

కొనుగోళ్లు... ఎగుమతులు
గత రెండు మూడు రోజుల్లో కొబ్బరి పచ్చికాయ ధర గణనీయంగా పెరిగింది. వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.15,500 నుంచి రూ.16 వేలకు చేరింది. రెండు రోజుల కిందట రూ.13,500 నుంచి రూ.14 వేల వరకూ ఉండేది. తమిళనాడు, కేరళలో కొబ్బరి దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీనికితోడు గత మార్చి నెల నుంచి కొబ్బరి బొండాల సేకరణ అధికంగా ఉంది. ఈ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల కొబ్బరి అవసరాలను రాష్ట్ర కొబ్బరి తీర్చాల్సి వస్తోంది. ముఖ్యంగా గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల స్థానిక అవసరాల కోసం మన రాష్ట్రం నుంచి కొబ్బరికాయ కొనుగోలు పెరిగింది. ఈ కారణంగా ధర పెరిగిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. 

కురిడీ... సంబరపడి  
అంబాజీపేట మార్కెట్‌లో కురిడీ కొబ్బరి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.  వారం రోజుల కిందట కురిడీ కొబ్బరిలో పాతకాయ గండేరా రకం (పెద్దకాయ) ధర వెయ్యికి రూ.20 వేలు మాత్రమే ఉండేది. ఇది రూ.22,500 వరకూ పెరిగింది. అలాగే గటగటా (చిన్నకాయ) వెయ్యికి రూ.18 వేల నుంచి రూ.20 వేలకు చేరింది. కొత్త కాయలో గండేరా రూ.21,500, గటగటా రూ.19,500 చొప్పున ధర పలుకుతున్నాయి.

కురిడీకి ధర రావడం వెనుక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు లేకపోవడం కూడా ఒక కారణం. ఉత్తరాదిలో ఆషాఢ మాసంలో కొబ్బరి వినియోగం అధికంగా ఉంటుంది. ఆ మాసానికి ఇంకా నెల రోజులు ఉండడంతో ధర పెరగడానికి ఇదొక కారణం. ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు సుమారు 70 నుంచి 100 లారీల వరకూ కురిడీ కొబ్బరి ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా.

మరింత పెరుగుతుందనే అంచనాతో..
ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో కొబ్బరి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. రెండు నెలల దింపు కాలానికి 1,500 నుంచి 2 వేల వరకూ కాయలు దిగుబడిగా వస్తున్నాయి. దిగుబడి ఆశాజనకంగా ఉండడం, అందుకు తగినట్టుగా ధరలు పెరగడంతో చాలా రోజుల తరువాత అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌కు జోష్‌ వచ్చింది. ధర మరింత పెరుగుతోందనే అంచనాతో కొబ్బరి రైతులు, కురిడీ వ్యాపారులు ఆచితూచి అమ్మకాలు చేస్తున్నారు.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)