Breaking News

రికార్డుల కొబ్బరి

Published on Mon, 06/16/2025 - 04:30

సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధరలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. కురిడీ కొబ్బరి ధర కనీవినీ ఎరుగని స్థాయిలో పెరి­గి ఆల్‌టైమ్‌ రికార్డు నమోదు చేయగా.. పచ్చి కొబ్బరి కాయ సైతం ఆల్‌టైమ్‌ హైరికార్డులు సృష్టిస్తోంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.17,500 నుంచి రూ.18.500 పలుకుతోంది. పచ్చి కొబ్బరికి ఈ స్థాయి ధర రావడం ఇదే మొదటిసారి. మరోవైపు కురి­డీ కొబ్బరి సైతం కురిడీ రూ.27 వేలకు చేరింది. 

ఉమ్మడి ఉభయ గోదా­వరి జిల్లాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఒక్క అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగవుతోంది. గత ఏడాది నుంచి పచ్చికాయ, ముక్కుడు కాయ (నిల్వ­కాయ) వెయ్యి కాయల ధర రూ.10 వేలకు తగ్గలేదు. తరువాత ఈ ధర పెరుగుతూ వస్తోంది. గత నెలలో వీటి ధర రూ.16 వేలకు చేరింది. ఇదే గరిష్ట ధర అనుకున్నారు. 

అయితే.. రైతులు, వ్యాపారుల అంచనా దాటి కొబ్బరి కాయ ధర రూ.17,500 నుంచి రూ.18,500 వరకూ పెరగడం గమనార్హం. పచ్చి కొబ్బరికి ఈ స్థాయి ధర రావడం మార్కెట్‌లో ఇదే మొదటిసారి. ఉత్తరాదిలోని గుజరాత్, హరియాణ,, మహారాష్ట్రతో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్‌లకు పచ్చికాయ అధికంగా ఎగుమతి అవుతోంది.  

కురిడీకి రికార్డు స్థాయి ధర 
కురిడీ కొబ్బరి సైతం మార్కెట్‌లో రికార్డు స్థాయి ధర పలుకుతోంది. పాత కాయలలో (8 నెలలకు పైబడి నిల్వ ఉన్న) గండేరా రకం (పెద్ద రకం) వెయ్యి కురిడీ కొబ్బరి కాయల ధర రూ.27 వేలకు చేరడం రికార్డు. గతంలో దీని సగటు ధర రూ.14 వేలు మించేది కాదు. ఇక గటగట (చిన్నకాయ) ధర రూ.25 వేలుగా ఉంది. కొత్త కాయల్లో గండేరా రూ.26 వేలు, గటగట రూ.24 వేల వరకు పెరగడం విశేషం. 

నిల్వలు లేకపోవడమే కారణం 
» ఏడాది కాలంగా రైతుల వద్ద, వ్యాపారుల వద్ద కొబ్బరి నిల్వ ఉండటం లేదు. గతంలో దింపు తీసిన కొబ్బరి రెండు, మూడు నెలలపాటు రైతుల వద్దనే ఉండేది. ధరలు ఆశాజనకంగా ఉండడంతో వారం వ్యవధిలోనే ఎగుమతి అవుతోంది. ఫలితంగా నిల్వలు తగ్గిపోయి కొబ్బరి, కురిడీ కొబ్బరికి డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. 

» ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాదికి కొబ్బరి కాయ ఎగుమతులు పెరిగిన కారణంగా మార్చి నెల నుంచి గోదావరి జిల్లాల కొబ్బరికి డిమాండ్‌ ఏర్పడింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. తమిళనాడు నుంచి జాతీయ మార్కెట్‌కు ఎగుమతి అయ్యే కొబ్బరిలో మూడోవంతు కూడా అందుబాటులో లేకుండా పోయింది. స్థానిక కొబ్బరి డిమాండ్‌ పెరగడానికి ఇది కారణమైంది. 

» మార్చి నుంచి మే నెలాఖరు వరకూ ఎకరాకు సగటున 1,200 కాయల వరకూ దిగుబడి వస్తోంది. తరువాత అది తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం సగటు దిగుబడి 700 కాయల వరకూ ఉంది. ఇది కూడా ధరల పెరుగుదలకు ఒక కారణమైంది. 

» ఇంత ధర ఉన్నా రైతులు వెంటనే అమ్మడం లేదు. ధర మరింత పెరిగే అవకాశముందనే అంచనాతో ఆచితూచి విక్రయిస్తున్నారు. 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)