Breaking News

కొబ్బరి రైతుకు ఊరట

Published on Thu, 01/02/2025 - 05:31

సాక్షి, అమలాపురం: అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌కు సం‘క్రాంతి’ వెలుగులొచ్చాయి. గడచిన వారం రోజులుగా పచ్చికొబ్బరి, కురిడీ కొబ్బరి ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి ఎగుమతులు జోరందుకున్నాయి.  ఉత్తరాదికి ఎగుమతులు పెరగడం.. తమిళనాడులో  దిగుబడులు తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో 1.77 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల మార్కెట్‌లో కొబ్బరి లావాదేవీలు అంబాజీపేట మార్కెట్‌లో ధరల ఆధారంగా సాగుతుంటాయి. ప్రస్తుతం అంబాజీపేట మార్కెట్‌లో పచ్చి కొబ్బరి, వెయ్యికాయల ధర రూ.14,500 నుంచి రూ.15 వేలకు చేరింది.

రోజుకు 70 నుంచి 100 లారీల ఎగుమతి
గతేడాది అక్టోబర్‌ నుంచి నవంబర్‌ వరకూ పచి్చకొబ్బరి వెయ్యి కాయల ధర రికార్డు స్థాయిలో రూ.18,500 వరకు పలికింది. తర్వాత ధర తగ్గినా రూ.14 వేల వద్ద స్థిరంగా ఉంది. వారం రోజుల నుంచి ధర పెరుగుతూ వస్తోంది. దీంతోపాటు కురిడీ కొబ్బరి ధరలు సైతం పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం పాత కాయలలో కురిడీ కొబ్బరి వేయింటికి గండేరా రూ.15 వేలు, గటగట రూ.13,500, కొత్త కాయలలో గండేరా రూ.14 వేలు, గటగట రూ.12,500 ఉండేవి. ఇప్పుడు వాటి ధరలు పెరిగాయి. 

ప్రస్తుత మార్కెట్‌లో పాత కురిడీ కొబ్బరి వెయ్యింటికి గండేరా రూ.17,500, గటగట రూ.16,000, కొత్త గండేరా రూ.16,800, గటగటా రూ.15,000 వరకూ పెరిగాయి. ఆయా రకాలకు రూ.రెండు వేల నుంచి రూ.2,500 వరకు పెరిగాయి. దీంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 70 నుంచి 100 లారీల వరకు కొబ్బరి ఎగుమతి అవుతోందని అంచనా.  

పెరిగిన వినియోగం
సంక్రాంతికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కొబ్బరి వినియోగం కొంత వరకూ పెరగడంతోపాటు స్థానికంగా దిగుబడి తగ్గడం కూడా ధర పెరుగుదలకు కారణం. ఈ సీజన్‌లో సగటు దిగుబడి ఎకరాకు 1,200 కాయలు కాగా, ప్రస్తుతం 400 కాయలు మాత్రమే దిగుబడిగా వస్తున్నాయి. 

తమిళనాడు, కర్ణాటకలో సైతం దిగుబడులు తగ్గడం కూడా రేటు పెరగడానికి కారణమైంది. మూడు నెలల నుంచి పచ్చికాయ ధర అధికంగా ఉండడం వల్ల కూడా కురిడీ కొబ్బరి ధర పెరుగుదలకు కారణమైంది. దిగుబడి తగ్గినా.. సంక్రాంతి సమయంలో కొబ్బరి ధరలు పెరగడం రైతులకు ఊరటనిచ్చే అంశంగా మారింది.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)