Breaking News

నిను వీడని ‘నాగు’ను నేను!

Published on Thu, 03/20/2025 - 05:25

పలమనేరు/బైరెడ్డిపల్లె: పిచ్చుగుంట్ల సుబ్ర­హ్మ­ణ్యం.. ఊరు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరకుంట. పదేళ్ల వయసులో ఐదో తరగతి చదువుతున్న అతడిని పశువులు కాస్తున్న సందర్బంలో ఓ నాగుపాము కాటేసింది. ప్రస్తుతం అతడి వయసు 48. ఇప్పటివరకు నాగుపాములు అయన్ని 103సార్లు కాటేశాయి. అయినా.. ఎప్పటికప్పుడు చికిత్స పొందుతూ మృత్యుంజయుడిగా మారాడు. 

తాజాగా నాలుగు రోజుల క్రితం పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ‘ఇదో మిరాకిల్‌’ అంటూ వైద్యులే షాకవుతున్న ఈ విచిత్రమైన ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. 

సుబ్రహ్మణ్యేశ్వరుడి కృపతో పుట్టారట 
బైరెడ్డిపల్లె మండలం కుమ్మరకుంటకు చెందిన పిచ్చుగుంట్ల కుప్పయ్య దంపతులకు పెళ్లయిన చాలాకాలం వరకు సంతానం లేదు. దీంతో ఆ దంపతులు తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి సంతానం కోసం మొక్కుకున్నారట. మొక్కు సాకారమై కొడుకు పుట్టడంతో అతడికి సుబ్రహ్మణ్యం అని నామకరణం చేశారు. సుబ్రహ్మణ్యం ఐదో తరగతి చదువుతూ పొలంలో పశువులను కాస్తుండగా మొదటిసారి నాగుపాము అతన్ని కాటేసింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎక్కడికెళ్లినా పాములు అతడిని వదలడం లేదు. 

తొలినాళ్లలో పెద్దగా ఆస్పత్రులు లేకపోవడంతో సుబ్రహ్మణ్యం పాము కాటేసినప్పుడల్లా బైరెడ్డిపల్లిలోనే  నాటువైద్యుడు దైవకటాక్షం వద్ద చికిత్సలు పొందేవాడు. ఆ తరువాత బైరెడ్డిపల్లి పీహెచ్‌సీ, కోలార్‌ మెడికల్‌ కాలేజీ, పీఈఎస్‌ కుప్పం, పెద్దపంజాణిలోని క్రిస్టియన్‌ ఆస్పత్రి, జేఎంజే గుట్టూరులో చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడుతున్నాడు. తాజాగా నాలుగు రోజుల క్రితం ఇంటిముందు మంచంపై కూర్చుని ఉండగా.. వెనుకనుంచి వచి్చన పాము కాలిపై కాటేసింది. గుట్టూరులో చికిత్స పొంది మంగళవారం అతడు డిశ్చార్జి అయి ఇంటికి చేరాడు.  
చికిత్సలకు రూ.లక్షల్లో ఖర్చు 
103సార్లు పాముకాట్లకు గురైన సుబ్రహ్మణ్యం చికిత్సలకు రూ.లక్షలు ఖర్చు పెట్టాడు. తనకున్న మూడెకరాల పొలం కాస్తా ఇప్పుడు రెండెకరాలకు చేరింది. ఆస్తులు విక్రయించి, అప్పులు చేసి ఇలా పాముకాట్ల నుంచి బయటపడుతున్నాడు. సుబ్రహ్మణ్యంను రైతులెవరూ కూలి పనులకు సైతం పిలవడం లేదు. 

కూలి పనులు చేస్తున్నప్పుడు పాము కాటేస్తే తాము బాధ్యులమవుతామనే భయమే దీనికి కారణం. ఎప్పుడు ఏ పాము కాటేస్తుందోననే ఆందోళనతో అతను ఇంటికే పరిమితమయ్యాడు. దీనిపై వైద్యులు సైతం ఇదో మిరాకిల్‌ అంటున్నారు. ఇలా ఎవరికీ జరగదని.. ఇతడినే పాములు ఎందుకు కాటేస్తున్నాయో అర్థం కావడం లేదంటున్నారు. 

తిరగని గుడుల్లేవు
చిన్నప్పటి నుంచి పాము కలలో కనిపించేది. పా­ము­కాట్లు మొదలయ్యాక నాగదోషం ఉందని కాళహస్తి వెళ్లా. తరువాత తిరుత్తణికి జీవిత కావడి మోస్తున్నా. వీరనాగమ్మ మా ఇలవేల్పు కాబట్టి.. ఇంటివద్ద నాగులు రాళ్లకు పూజలు చేస్తున్నా. కొక్కే సుబ్రహ్మణ్యస్వామి, తిరువణ్ణామలై, కురుడమళై కులదేవీ తదితర ఆలయాలకు తిరిగినా పాము కసి వదలిపెట్టలేదు.       – సుబ్రహ్మణ్యం, నాగుపాము కాటు బాధితుడు 

నాగుపాములు పగబట్టవు 
నాగుపాములు పగబడతా­యనేది నిజం కాదు. పాములకు ఉండేది చిన్నపాటి మెదడు. దీనివల్ల వాటికి జ్ఞాపకశక్తి తక్కువ. ఏవేవో పాములు అతన్ని యాధృచ్చికంగా కాటేస్తుండవచ్చు. పగబట్టి మాత్రం కాదు. ఇలాంటి మూఢనమ్మకాలతో తనకు నాగదోషం ఉందని, పాము పగబట్టిందని భావించడం వట్టి ట్రాష్‌ మాత్రమే. మేం అతడింటికి వెళ్లి అవగాహన కల్పిస్తాం.  – యుగంధర్, జన విజ్ఞాన వేదిక నాయకుడు, పలమనేరు  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)