Breaking News

ఆ పోస్టులకు 65 ఏళ్ల వారూ అర్హులే!

Published on Thu, 08/29/2024 - 05:48

సాక్షి, అమరావతి: రాజు తలచుకుంటే ‘దెబ్బల’కు కొదవా  అన్న నానుడికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పదవుల కోసం క్యూ కట్టేవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడంతో.. తమకు అనుకూలంగా ఉన్న వారిని అందలం ఎక్కించేందుకు.. గతంలో ఉన్న నిబంధనలను సైతం అడ్డగోలుగా మార్చేస్తున్నది. తాజాగా రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో డైరెక్టర్ల నియామకానికి సంబంధించి, ఇన్నాళ్లూ గరిష్ట వయసు పరిమితి 62 ఏళ్లుగా ఉండేది. అయితే ఇకపై 65 ఏళ్ల వయసు వారు కూడా ఆ పదవులకు అర్హులేనంటూ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. 

విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లతో పాటు ఏపీజెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కోలకు కూడా తాజా నిబంధన వర్తిస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో విద్యుత్‌ సంస్థల్లో నియమితులైనవారు.. రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హెచ్చరించింది. వారి స్థానంలో తమ వారిని, భారీగా ముడుపులు ఇచ్చే వారిని నియమించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో కీలక పోస్టుల్లో ఉన్న కొందరిని బలవంతంగా బయటకు పంపించారు. 

వారిలో ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్‌ జేఎండీ, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మల్లారెడ్డి, ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్‌కో ఓఎస్‌డీ ఆంటోనిరాజు ఉన్నారు. వీరి తరువాత పదిమంది డైరెక్టర్ల చేత గత జూలైలో రాజీనామాలు చేయించారు. కూటమి నేతలు ఆ పోస్టులకు ఇప్పటికే రూ.కోట్లలో బేరాలు మొదలు పెట్టారు. అయితే తామనుకున్నది చేసేందుకు, తాము కోరుకున్నవారిని నియమించేందుకు వయసు అడ్డు రావడంతో దానిని సవరించారు. 

మూడేళ్లు పెంచేసుకుని, అరవై ఐదేళ్లు ఉన్నవారికీ అవకాశం కల్పించేలా కొత్త జీవో రూపొందించారు. గతంలో విద్యుత్‌ సంస్థల్లో చీఫ్‌ జనరల్‌ మేనేజర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు తాజాగా డైరెక్టర్ల పోస్టులకు పోటీ పడుతున్నారు. ఎలాగైనా కూటమి నేతలను ప్రసన్నం చేసుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి కోసమే కొత్తగా ఈ వయసు పెంపుదల అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)