Breaking News

బాధపడొద్దు.. నేనున్నా 

Published on Mon, 04/08/2024 - 05:19

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర సందర్భంగా పలువురు అనారోగ్య బాధితులు, వృద్ధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ సమస్యలు విన్నవించి ఆదుకోవాలని అభ్యర్ధించారు. వారి కష్టాలను సావధానంగా ఆలకించిన సీఎం జగన్‌ ప్రతి ఒక్కరి నుంచి అర్జీలను స్వీకరించారు. ‘‘బాధపడొద్దు.. నేను ఉన్నాను. తప్పకుండా మీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తా’’ అని భరోసా ఇచ్చి అర్జీలను వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు. – సింగరాయకొండ (మర్రిపూడి) పొన్నలూరు/పీసీపల్లి

టీడీపీ వాళ్లు పొలం కబ్జా చేశారయ్యా.. 
మర్రిపూడి మండలం చిలంకూరు గ్రామానికి చెందిన రాయిపాటి లక్ష్మీనరసయ్య (70) వైఎస్సార్‌ మరణానంతరం వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పదేళ్ల పాటు గడ్డం పెంచాడు. 2019 ఎన్నికలకు ముందు జగన్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్నాడు. దీనిపై కక్షగట్టిన టీడీపీ సానుభూతిపరులు లక్ష్మీనరసయ్యకి చెందిన 9 ఎకరాల పొలాన్ని కబ్జా చేశారు. బస్సు యాత్ర సందర్భంగా ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తేవడంతో పెద్దాయన సమస్యను నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

ఉద్యోగం కోసం వినతి 
2017లో బీకాం చదివిన పీసీపల్లి మండలం అలవలపాడు కొత్తూరుకు చెందిన రావి సురేష్‌ ప్రస్తుతం వలంటీర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారంగా ఉన్నందున ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ సీఎం జగన్‌కు వినతిపత్రం అందజేశాడు.  

ట్రై సైకిల్‌ ఇప్పించండన్నా
బస్సు యాత్ర కనిగిరి మండలం అజీజ్‌పురానికి చేరుకున్న సమయంలో గ్రామానికి చెందిన కేశారపు దేవమ్మ అనే దివ్యాంగురాలు సీఎం జగన్‌ను కలిసింది. దివంగత వైఎస్సార్‌ గతంలో తనకు ఇచి్చన ట్రైసైకిల్‌ మూలనపడినందున కొత్తది ఇప్పించాలని విన్నవించింది. 

నలుగురు బిడ్డలున్నా... 
‘‘చూపు కోల్పోయి పని చేయడానికి వీలు లేకుండా పోయింది. కుటుంబ పోషణ అంతంత మాత్రం. ఆర్థిక సాయం చేయండి సారూ’’ అంటూ కనిగిరి మండలం అజీస్‌పురంలో కేశారపు రోశయ్య వేడుకున్నాడు. తనకు  నలుగురు పిల్లలున్నా పట్టించుకోవడం లేదని, ఒంటరినయ్యానని సీఎం జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరి్థక సాయం చేసి ఆదుకోవాలంటూ విలపించాడు.  

దివ్యాంగుడిని ఆదుకోండయ్యా
కనిగిరి మండలం ఏరువారిపల్లిలో గ్రామానికి చెందిన లక్కె మంగమ్మ దివ్యాంగుడైన తన కుమారుడు లక్కె సాయిని వెంటబెట్టుకుని సీఎం జగన్‌ను కలిసింది. మన ప్రభుత్వంలో దివ్యాంగ పింఛన్‌ వస్తోందని తెలిపింది. తన కుమారుడికి ఆరి్థక సాయం చేసి ఆదుకోవాలంటూ విన్నవించింది.   

► శారీరక ఎదుగుదల లేని పొన్నలూరు గ్రామానికి చెందిన వెలగపూడి ఏసుబాబు అర్హత ఉన్నా తనకు సదరం సరి్టఫికెట్‌ మంజూరు చేయడం లేదని, పింఛన్‌ పొందలేకపోతున్నానని విన్నవించాడు.  
► పరుచూరివారిపాలెం గ్రామానికి చెందిన నేలపాటి నరసింహం ఎడమ కాలు రోడ్డు ప్రమాదంలో విరిగిపోయింది. తనకు మెరుగైన వైద్యం అందించాలని సీఎంకు విన్నవించాడు.  
► కల్లూవారిపాలెం గ్రామానికి చెందిన కప్పల రియాగ్రేస్‌కు రెండు కళ్లు కనిపించకపోవడంతో శస్త్ర చికిత్స చేశారు. అయితే దురదృష్టవశాత్తూ శస్త్ర చికిత్స విఫలమైందని, మరోసారి శస్త్ర చికిత్స కోసం ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె తల్లిదండ్రులు కోరారు.  
► మరికొందరు వృద్ధులు తమకు ఆరోగ్య సమస్యలున్నాయని, వాటిని నయం చేసేందుకు వైద్య సాయం అందించాలని వేడుకున్నారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)