Breaking News

రాజమహేంద్రవరానికి సీఎం జగన్‌ 

Published on Tue, 08/08/2023 - 05:00

సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి వరద ప్రభా­విత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ తొలి రోజు సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూ­రు జిల్లాల్లో పర్యటించారు. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం సాయంత్రం 6.24 గంటలకు హెలికాప్టర్‌లో రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్‌ జగన్‌కు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం  ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌కు చేరుకొన్నారు. రాత్రి అక్కడే బస చేశారు. 

బాధితులకు అండగా.. 
హెలిపాడ్‌ నుంచి గెస్ట్‌ హౌస్‌కు వచ్చే మార్గంలో సీఎం వైఎస్‌ జగన్‌ను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. రోడ్లకు ఇరువైపులా నిలుచొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం జగన్‌ వారికి అభివాదం చేశారు. దారిలో ఇద్దరు అనా­రోగ్య బాధితులను పలకరించారు. వారి సమస్య విని తక్షణం సహాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ మాధవిలతను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్‌ ఆ కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ. లక్ష సాయం అందజేశారు.  

కోనసీమ జిల్లాలో పర్యటన ఇలా.. 
సీఎం జగన్‌ మంగళవారం ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరంలోని ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం నుంచి అర్ట్స్‌ కళాశాలకు చేరుకుంటారు. 9.10కి ఆర్ట్స్‌ కళాశాల వద్ద హెలికాప్టర్‌లో బయలుదేరి 9.40కి బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా  గురజపులంక చేరుకుంటారు. 10.25 వరకు  గ్రామంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.

10.35కు రామాలయపేటకు రోడ్డు మార్గానికి చేరుకుని, 11.10  వరకు రామాలయపేటలో వరద బాధితులతో మాట్లాడతారు. 11.10 గంటలకు అక్కడి నుంచి  అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామానికి చేరుకుంటారు. 11.20 నుంచి 11.50 గంటల వరకు అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. 11.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో గురజపు లంక గ్రామానికి 12.15 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో తాడేపల్లికి వెళతారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)