Breaking News

Watch Live: సీఎం జగన్‌ విద్యాదీవెన

Published on Fri, 03/01/2024 - 12:52

కృష్ణా జిల్లా పామర్రులో సీఎం జగన్ విద్యాదీవెన పథకం కింద రూ.708.68కోట్లు ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. ఈ విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్ధులకు లబ్ధి జరిగింది. పెద్ద చదువులు చదువుతున్న పేదింటి పిల్లల ఫీజు డబ్బులు వారి తల్లులకు ఇస్తున్నామని సీఎం జగన్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు.

  • 57 నెలలుగా విద్యా దీవెన కార్యక్రమం కొనసాగుతోంది
  • పిల్లల చదువుల కోసం పేదల అప్పులపాలు కాకూడదని అనుకున్నాం
  • 93 శాతం మందికి విద్యాదీవెన అందిస్తున్నాం
  • పిల్లల పూర్తి ఫీజును కట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది
  • విద్యా దీవెనతో పాటు జగనన్న వసతి దీవెన అమలు చేశాం
  • గత త్రైమాసికానికి సంబంధించి రూ.708 కోట్లు ఇస్తున్నాం
  • విద్యాదీవెన, వసతిదీవెన కోసం రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం
  • విద్యారంగంపై ఐదేళ్లలో 73 వేల కోట్లు ఖర్చు చేశాం
  • ప్రభుత్వ పాఠశాలలో సీబీఎస్ నుంచి ఐబీఎస్ వరకు చదువు చెప్పిస్తున్నా్ం
  • ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తెచ్చాం
  • ఈ పనులు చేస్తుంటే విపక్షాలు విమర్శిస్తున్నాయి
  • చంద్రబాబు,దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది
  • విమర్శించే వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు
  • పెత్తందార్లకు ఓ ధర్మం..పేదలకు మరో ధర్మమా
  • విద్యారంగంలో ప్రస్తుతం క్లాస్ వార్ జరుగుతోంది
  • డబ్బులు ఉన్నవారికి,లేనివారికి యుద్ధం జరుగుతోంది
  • ప్రభుత్వం ట్యాబ్ లు ఇస్తే చంద్రబాబు,పవన్ విమర్శిస్తున్నారు
  • పెత్తందార్ల కుట్రలు ప్రజలు గమనించాలని కోరుతున్నా
  • పేద విద్యార్ధుల కోసమే ఈ డబ్బు ఖర్చు చేస్తున్నాం
  • విద్యార్ధులు పోటీ ప్రపంచంలో ఎదగాలన్నదే మా లక్ష్యం
  • నాడు-నేడుతో బడులను మార్చేశాం
  • పేద పిల్లలు విదేశాలకు వెళ్లి పెద్ద చదువులు చదువుతున్నారు
  • విద్యార్ధులకు వందశాతం ఫీజులు ప్రభుత్వం భరిస్తోంది
  • పిల్లలకు మనం అందించే గొప్ప ఆస్తి చదువే
  • చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలి
  • విద్యాదీవెనతో పేదింటి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు
  • క్రమం తప్పకుండా విద్యాదీవెన నిధులు అందిస్తున్నాం
  • విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి
  • ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపు
  • పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
  • ఏ పేదవాడు తన పిల్లల చదువు కోసం అప్పులపాలు కాకూడదు
  • మన ప్రభుత్వం వచ్చాక ఆయా ఆదాయపరిమితులు పెంచాం
  • వీలైనంత మందికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం
  • పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు
  • ఫీజులే కాకుండా వసతి ఖర్చుల కోసం వసతి దీవెన ఇస్తున్నాం
  • 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం
  • రూ.708.68 కోట్లు ఖాతాల్లో ఇప్పుడు జమ చేయబోతున్నాం
  • జగనన్న విద్యా దీవెనతో ఇప్పటి వరకు రూ.12,610 కోట్లు అందించాం
  • వసతి దీవెన, విద్యా దీవెన కోసం ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు వెచ్చించాం
  • ఎప్పుడూ చూడని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
  • విద్యారంగంలో ఇప్పటి వరకూ రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం
  • కేవలం పిల్లల చదువుల కోసమే 57 నెలల కాలంలో రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం
  • తర్వాతి తరాలకు మనం అందించే గొప్ప ఆస్తి చదువే
  • మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలి
  • ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
  • ఈరోజు క్వాలిటీతో ఉన్న చదువులే మన పిల్లలకు కావాలి
  • క్వాలిటీ చదువుల అవసరం తెలుసుకున్నాం కాబట్టే విప్లవాత్మక మార్పులు అమలు చేస్తున్నాం
  • మన పిల్లలు పోటీ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలి
  • ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం
  • ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే విమర్శలు చేస్తున్నారు
  • చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది
  • వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి....మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా?
  • తెలుగు భాష అంతరించిపోతుందంటూ నానా యాగీ చేస్తున్నారు
  • పెత్తందారుల కుట్రలు గమనించమని కోరుతున్నా
  • పెత్తందారుల పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండొచ్చు
  • మీకు ట్యాబులు ఇస్తే చెడిపోతారంటూ నానా యాగీ చేస్తున్నారు
  • పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారుల మనస్తత్వం గమనించండి
  • పెత్తంతారులతో మనం క్లాస్ వార్ చేస్తున్నాం
  • చంద్రబాబు, ఆయన మనుషుల పెత్తందారీ భావజాలాన్ని గమనించండి
  • 57 నెలల కాలంగా జగన్నాథ రథచక్రాలు ముందుకు సాగుతున్నాయి
  • మన పిల్లలు పోటీ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలి
  • మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలి
  • ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
  • నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం
  • ప్రభుత్వం ట్యాబ్‌లు ఇస్తే చంద్రబాబు, పవన్ విమర్శిస్తున్నారు
  • పిల్లలకు మంచి చేస్తున్న మనపై చంద్రబాబు అండ్ కో యుద్ధం చేస్తుంది
  • పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు ఎప్పుడైనా చంద్రబాబు ప్రయత్నించారా?
  • చంద్రబాబు పేద విద్యార్థుల కోసం చేసిన మంచి ఏంటి?
  • చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన చెడు చాలానే ఉంది
  • చంద్రబాబు ఏరోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నారా?
  • నేను చేసిన పనుల్లో ఒక్క శాతమైనా చంద్రబాబు చేశారా?
  • నారాయణ, చైతన్య విద్యా సంస్థల కోసమే చంద్రబాబు ఆలోచన
  • జగన్ అనే వ్యక్తి తప్పుకుంటే జరిగే నష్టం గురించి ఆలోచించండి
  • జగన్ మళ్లీ రాకుంటే పిల్లల చదువులు, సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయి
  • జగన్ మళ్లీ రాకుంటే పేదవాడు అప్పులపాలవుతాడు
  • ప్రతీ ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ అంటూ అబద్ధాలు చెబుతారు
  • వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరుతున్నా
  • మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే జగన్ కు ఓటు వేయండి

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు