Breaking News

‘ఆడుదాం ఆంధ్ర’కు సన్నద్ధం 

Published on Sun, 07/23/2023 - 04:35

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లకు సీఎస్‌ జవహర్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

పురుషులు, మహిళలకు అన్ని స్థాయిల్లో కలిపి మొత్తం 2.99 లక్షల మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వీటితోపాటు సంప్రదాయ క్రీడల్లో కూడా పోటీలు నిర్వహించాలని సూచించారు. వీటి నిర్వహణకు అవసరమైన అన్ని క్రీడా మైదానాలను గుర్తించి సిద్ధం చేయాలని ఆదేశించారు.  పోటీల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, ఇంజినీర్లు, పంచాయతీరాజ్‌ ఈవోలకు తగిన ఆదేశాలివ్వాలని సూచించారు.

పోటీల సమయంలో క్రీడాకారులకు రవాణా, ఆహారం, వసతి ఏర్పాటు చేయాలన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహా్వనించాలని పేర్కొన్నారు. అన్ని స్థాయిల్లో పోటీల నిర్వహణకు మొత్తం 46 రోజులు పడుతుందన్నారు. అన్ని మ్యాచ్‌లు సంబంధిత చీఫ్‌ కోచ్‌ రూపొందించిన ప్రణాళిక ప్రకారమే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి స్థాయిలో పోటీల నిర్వహణకు ఆర్గనైజింగ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)