Breaking News

సీఎం సాయం.. శరవేగం

Published on Tue, 02/20/2024 - 04:55

అనంతపురం: మరోసారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిద్ధం సభ కోసం ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. ఈ క్రమంలో పలువురు బాధితులు  సీఎంను కలిసి తమను ఆదుకోవాలని వినతిపత్రాలు అందజేశారు. దీంతో బా­ధితులకు ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్‌  కలెక్టర్‌ గౌతమికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు 24 గం­టలు గడవకముందే బాధితులకు చెక్కులు అందించారు. 

► అనంతపురం నగరంలోని కమలానగర్‌కు చెందిన పర్లపాటి సుజాత తన భర్త చనిపోయాడని, తనకు కూడా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సీఎం వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయింది. ఇద్దరు పిల్లలు­న్నారని, ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించిం­ది. సమస్యను సావధానంగా విన్న ముఖ్యమంత్రి.. కలెక్టర్‌ గౌతమిని పిలిచి వెంటనే ఆదుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో సోమవారం కలెక్టరేట్‌లో బాధితురాలు సుజాతకు రూ.2 లక్షల చెక్కును కలెక్టర్‌ అందజేశారు. బాధితురాలికి ఇంటి పట్టా ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు, పింఛన్‌ మంజూరు చేయాలని ఆదేశించారు.

► అనంతపురం రూరల్‌లోని విద్యారణ్య నగర్‌కు చెందిన దివ్యాంగురాలు రాచూరి ఝాన్సీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. సీఎం ఆదేశాల మేరకు బాధితురాలికి రూ.లక్ష చెక్కును జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో డీఆర్‌వో రామకృష్ణారెడ్డి అందజేశారు. ఆరోగ్యశ్రీ కార్డు అందిస్తామని భరోసా ఇచ్చారు. సీఎంకు తమ సమస్యలను చెప్పుకుని 24 గంటలు గడవక ముందే ఆదుకోవడంపై బాధితురాలు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)