Breaking News

CM Jagan: మరింత ‘స్మార్ట్‌’గా ఆరోగ్యశ్రీ

Published on Mon, 12/18/2023 - 08:56

 CM YS Jagan Launch Mega Aarogyasri Awareness Programme Updates
 

సీఎం జగన్‌ మాట్లాడుతున్నారు..

  • ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
  • దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నాం
  • వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది
  • ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం
  • ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచాం
  • రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 513 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు
  • ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నాం
  • ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ
  • క్యూఆర్‌ కోడ్‌తో కార్డులో లబ్ధిదారుని ఫొటో, ఇతర వివరాలు
  • ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలి
  • ఆరోగ్యశ్రీ మార్పులు.. విప్లవాత్మకమైన మార్పులు
  • ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతీ ఒక్కరికీ విస్తరించాలన్నదే లక్ష్యం
  • రాష్ట్రంలోని 4 కోట్ల 25 లక్షల మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు
  • ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ. 4వేల 100 కోట్లు ఖర్చు చేస్తున్నాం
  • గతంలో రూ.5 లక్షలకు మించి ఇవ్వలేదు
  • రాష్ట్రంలో కొత్తగా మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నాం
  • పార్లమెంట్‌ స్థానానికి ఒక మెడికల్‌ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించాం
  • ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం
  • పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యం
  • పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం



తాడేపల్లి కార్యక్రమంలో.. ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్‌

► సీఎం జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం. పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సంబంధిత శాఖ అధికారులు

► కాసేపట్లో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

► ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించడం.. అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైనా అర్హులకు అవగాహన కల్పిండమే ఈ కార్యక్రమ ఉద్దేశం. దీంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్యం పరిధి రూ.25 లక్షల దాకా పెంపును సైతం  ఆయన ప్రారంభిస్తారు. 

► పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు తీసుకొచ్చిందే డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం.

► దీనికి  మరిన్ని మెరుగులు దిద్దుతూ.. మరింత బలోపేతం చేసే కార్యక్ర­మా­న్ని సీఎం జగన్‌ సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఇక నుంచి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది. 


కొత్త కార్డుల్లో ఏముంటాయంటే..  
 

  • క్యూఆర్‌ కోడ్, లబ్దిదారుని ఫొటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్‌ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు
  • ఎల్రక్టానిక్‌ హెల్త్‌ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో ఏబీహెచ్‌ఏ ఐడీ
  • క్యూఆర్‌ కోడ్‌తో లాగిన్‌ ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్‌ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా అనుసంధానమైన మార్గాలు తెలుసుకోవచ్చు 
  • ఆరోగ్యమిత్ర కాంటాక్టు నంబర్లు సైతం తెలుసుకునే వీలు
  • రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన
  • మెరుగైన ఉచిత వైద్యం లభించేందుకు మార్గం సులభతరం 

అవగాహన అందరికీ..
► ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ద్వారా..  లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేయించాలి 
►  యాప్‌ ద్వారా ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలనే సందేహాలన్నింటినీ ప్రతిఇంట్లో నివృత్తిచేసే కార్యక్రమం ఇది
►  అలాగే కొత్త కార్డుల పంపిణీ సందర్భం­గా ప్రతీ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్‌లో ఆరో­గ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, వలంటీ­ర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతి­నిధులు కృషి చేయాలి

ఇదీ చదవండి: జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్‌–2 జనవరి 1 నుంచి..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)