Breaking News

వైద్యురాలి ఊపిరితిత్తుల మార్పిడికి సీఎం జగన్‌ చేయూత

Published on Sun, 06/25/2023 - 09:10

సాక్షి, అమలాపురం: అనారోగ్యంతో బాధపడుతున్న వైద్యాధికారి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఔదార్యం చూపింది. దెబ్బతిన్న ఊపిరితిత్తులు, అవయవ మార్పిడి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.30 లక్షలు మంజూరు చేసింది. ఈ విషయాన్ని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా శనివారం విలేకరులకు తెలిపారు.

వివరాల ప్రకారం.. జిల్లాలోని కె.గంగవరం మండలం పేకేరు పీహెచ్‌సీ వైద్యాధికారిగా కాలే యేసు దేవీకుమారి పదేళ్లుగా పని చేస్తున్నారు. ఆమె రెండో దశలో కోవిడ్‌ బారినపడి కోలుకున్న తర్వాత అరుదైనవ్యాధి సోకడంతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. దీనికి కొంతకాలం నుంచి ఆమె చికిత్స పొందుతున్నారు. కానీ ఊపిరితిత్తులు 85శాతం దెబ్బతినడంతో నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్సలు చేసినా ఫలితం లేకపోవడంతో ఊపిరి తిత్తులు మార్పిడి చేయాలని వైద్యులు చెప్పారు. అదే సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 7వ తేదీన జిల్లాలోని రాజోలు నియోజకవర్గ పర్యటనకు వచ్చారు.

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా చొరవతో డాక్టర్‌ యేసు దేవీకుమారి భర్త, కొత్తపేట మండలం అవిడి పీహెచ్‌సీ వైద్యాధికారి పి.రవికుమార్‌... సీఎం జగన్‌ను కలిసి తన భార్యకు వైద్యం కోసం సహాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తానని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ప్రాతిపదికన అవయవ మార్పిడి జరిగిన తర్వాత నేరుగా యశోద ఆస్పత్రికి చెల్లించే విధంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.30 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

సీఎం సాయం మరువలేం
చాలా సంతోషంగా ఉంది. నా భార్య ప్రాణాలు నిలిపేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సాయం మరువలేం. నా భార్య అనారోగ్య సమస్యను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా దృష్టికి తీసుకువెళ్లాను. డీఎంహెచ్‌వో ద్వారా కలెక్టర్‌ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సీఎం జగన్‌ వద్దకు కలెక్టర్‌ తీసుకువెళ్లి నాతోపాటు ఆయన కూడా సమస్యను వివరించారు. తర్వా త మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ స్వయంగా సీఎం వద్దకు ఫైల్‌ తీసుకువెళ్లారు. వీరందరి కృషితో నా భార్య ఊపిరితిత్తుల మార్పిడికి ఈ సాయం అందింది.

– డాక్టర్‌ రవికుమార్, వైద్యాధికారి, అవిడి పీహెచ్‌సీ, కొత్తపేట మండలం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

ఇది కూడా చదవండి: Andhra Pradesh:భూ చిక్కుముడులకు చెక్‌

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య