విద్యుత్‌ సంస్థల ఉన్నతాధికారులకు సీఎం అభినందనలు

Published on Tue, 01/03/2023 - 07:46

సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్‌ సంస్థలు జాతీయస్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నందుకు.. ఆ సంస్థల ఉన్నతాధికారులను సీఎం జగన్‌ అభినం­దించారు. విద్యుత్‌ సమర్థ వినియోగంలో ఏపీ విద్యుత్‌ సంస్థలు ఇటీవల మూడు అవార్డులు గెలుచుకున్నాయి. ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవలప్‌­మెంట్‌ విషయంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపికైంది. దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్‌మిషన్‌ యుటిలిటీగా ఏపీ ట్రాన్స్‌కో ఎంపికైంది. న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ పునరుత్పాదక కార్పొరేషన్‌లలో ఒకటిగా ఎనర్షియా అవార్డును గెలుచుకుంది.

ఈ అవార్డులను సోమవారం ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌కు ఇంధన శాఖ ఉన్నతాధికారులు అందించారు. వారిని అభినందించిన సీఎం జగన్‌.. భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు గెల్చుకునేలా కృషి చేయాలని సూచించారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజ­యానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, ఎన్‌ఆర్‌ఈడీసీ, ఏపీ వీసీ ఎండీ ఎస్‌.రమణా­రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ(హెచ్‌ఆర్‌డీ) ఐ.పృథ్వితేజ్, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మాజనార్ధన్‌రెడ్డి, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ(విజిలెన్స్‌) బి.మల్లారెడ్డి పాల్గొన్నారు. 

సీఎం జగన్‌కు మంత్రుల శుభాకాంక్షలు
పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సీఎం జగన్‌ను కలిసి నూతన సంవత్సర శుభా­కాం­క్షలు తెలిపారు. మంత్రులు బొత్స సత్యనా­రాయణ, ఆదిమూలపు సురేశ్, ఆర్కే రోజా, జోగి రమేశ్‌తో పాటు ఉన్నతాధికారులు సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి:  విద్యుత్తు, నీళ్లు, డ్రైనేజీ తప్పనిసరి

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)