నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
దీప్కేను విడుదల చేసి.. సౌరవ్, ఆశుతోష్‌ను జైల్లోనే ఎందుకు ఉంచారు?
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
రిజిస్ట్రేషన్ శాఖలో ఇ–స్టాంపింగ్ సేవలను ప్రారంభించిన సీఎం జగన్
Published on Fri, 04/21/2023 - 14:01
సాక్షి, తాడేపల్లి: రిజిస్ట్రేషన్ శాఖలో ఇ–స్టాంపింగ్ సేవలను క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ కమిషనర్, ఐజీ రామకృష్ణ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ డీఐజీ (గుంటూరు) జి.శ్రీనివాసరావు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు హాజరయ్యారు.

ఇ–స్టాంపింగ్ ప్రయోజనాలు
- ఈ విధానం సురక్షితమైనది, భద్రతగలది మరియు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేనిది
- www.shcilestamp.com వెబ్సైట్లో మరియు ఇ–స్టాంపింగ్ మొబైల్ యాప్ ద్వారా ఇ–స్టాంపులు ఆన్లైన్లో దృవీకరించుకోవచ్చు
- నగదు,చెక్కు,ఆన్లైన్ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్,యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు
- ఎస్బీఐ,ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 కు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది
- మరొక 1000కి పైగా కేంద్రాల వద్ద త్వరలో ఈసేవలు అందుబాటులోకి రానున్నాయి
- ఇప్పుడు ఏపీలో క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 కు పైగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్ ద్వారా స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను చెల్లించవచ్చు
- స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ సెంట్రల్ రికార్డు నిర్వహించే ఏజెన్సీ అయిన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏపీ ప్రభుత్వం అందిస్తున్న మరొక ప్రజాహితమైన కార్యక్రమం

#
Tags : 1