Breaking News

సీఎం జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

Published on Tue, 04/18/2023 - 11:19

టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి రేపు(బుధవారం) సీఎం జిల్లాకు రానున్నారు. 

● బుధవారం ఉదయం 8 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు.

● ఉదయం 9.20కు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

● 9:30 గంటలకు విశాఖపట్టణంలో బయల్దేరి సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు 10.15 గంటలకు చేరుకుంటారు.

● 10.20 గంటలకు హెలీప్యాడ్‌ వద్ద నాయకులు సీఎంకు స్వాగతం పలుకుతారు.

● 10.25 గంటలకు హెలీప్యాడ్‌ నుంచి పోర్టు శంకుస్థాపన పైలాన్‌ ఆవిష్కరణకు బయల్దేరుతారు.

● 10:30 నుంచి 10:47 వరకు పోర్టు శంకుస్థాపన, గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

● 11 గంటలకు మళ్లీ హెలీకాప్టర్‌లో బయల్దేరి 11.10 గంటలకు నౌపడ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.

● 11.10 నుంచి 11.20 వరకు హెలీప్యాడ్‌ వద్ద నాయకులంతా సీఎంకు స్వాగతం పలుకుతారు.

●11.25 గంటల నుంచి 11.35 వరకు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు.

● 11.45 నుంచి 12 గంటల వరకు సభా వేదికపై ఇతర నాయకులు ప్రసంగిస్తారు.

● మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు సభా వేదికపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం చేస్తారు.

● 12.35 గంటలకు మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.

● 12.40 గంటలకు సభా వేదిక నుంచి బయల్దేరి హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.

● 12.45 నుంచి 1.05 వరకు స్థానిక నాయకులతో మాట్లాడుతారు.

● మధ్యాహ్నం 1.10 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

● మధ్యాహ్నం 2.10 గంటలకు విశాఖపట్టణం నుంచి గన్నవరం చేరుకుంటారు.

● మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
చదవండి: AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)