Breaking News

డిసెంబర్‌ నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తి చేయాలి

Published on Thu, 09/29/2022 - 13:41

సాక్షి, తాడేపల్లి: ఎస్‌డీజీ(స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్‌డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ చేపట్టారు. ఈ సందర్భంగా.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కేటాయించిన నిధులపై సమీక్ష జరిపారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం నిర్వహించిన తర్వాత నెల రోజుల్లో ప్రాధాన్యతా పనులు మొదలు కావాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే.. అక్టోబరు 25న ఈ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శించాలని, ఈ మేరకు షెడ్యూల్‌ వివరించారాయన. 


అలాగే.. ఉపాధి హామీ పథకం కింద కనీసం వేతనం రూ.240 అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌. డిసెంబర్‌ 21వ తేదీ నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే.. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్‌ –3 కింద డిసెంబర్‌లో ఇళ్ల మంజూరు చేయాలన్నారు. 

ఎస్‌డీజీ(స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్‌డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. స్పందనలో వస్తున్న ఫిర్యాదులు పరిష్కారంపై సమీక్ష నిర్వహించడంతో పాటు జాతీయ రహదారులకు కావాల్సిన భూసేకరణ, వైఎస్సార్ అర్బన్-విలేజ్ క్లినిక్స్ పై సీఎం జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.


చదవండి: గుడ్‌ న్యూస్‌.. ఆ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌

Videos

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)