Breaking News

‘విద్యార్థుల తరలింపు సీఎం జగన్‌ కృషి వల్లే సాధ్యమైంది’

Published on Mon, 05/08/2023 - 14:35

సాక్షి, తాడేపల్లి : మణిపూర్‌లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రెండు ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. కాగా, ఇంఫాల్‌ నుంచి 106 మంది విద్యార్థులతో ప్రత్యేక విమానం బయలుదేరింది. ఇక, విద్యార్థుల భోజన, రవాణా సదుపాయాలన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేశారు. 

ఈ సందర్బంగా సీఎం జగన్‌ సెక్రటరీ ముత్యాలరాజు స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను రక్షించాం. ఈ ఆపరేషన్‌పై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. మణిపూర్‌ సీఎస్‌తో మన ప్రభుత్వం టచ్‌లో ఉంది. ఒక్కో విద్యార్థిని నోడల్‌ పాయింట్‌గా పెట్టుకుని మిగతా స్టూడెంట్స్‌ని గుర్తించాం.  ఇప్పటి వరకు 161 మంది విద్యార్థులను గుర్తించాం. 

కమర్షియల్‌ ఫ్లైట్స్‌లో వారిని తీసుకురావాలంటే లేట్‌ అవుతుందని స్పెషల్‌ ఫ్లైట్స్‌ పంపాం. విమానయాన శాఖ కూడా వెంటనే స్పందించింది. కోల్‌కత్తా, హైదరాబాద్‌లో దిగిన విద్యార్థులను గమ్యస్థానాలకు చేరుస్తాం. హైదరాబాద్‌ నుంచి కూడా ప్రత్యే క బస్సులు ఏర్పాటు చేశాం. కొందరికి రెగ్యులర్‌ ఫ్లైట్స్‌లో కూడా టికెట్టు బుక్‌ చేశాం. వారిని ఎయిర్‌పోర్టు నుంచి కార్లలో స్వస్థలాలకు పంపుతాం అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఫలించిన సీఎం జగన్‌ యత్నం

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)