Breaking News

రూ.200 కోట్లతో గ్రామాలకు రక్షణ గోడ

Published on Wed, 08/09/2023 - 06:10

సాక్షి అమలాపురం: గోదావరి నది కోత వల్ల ఇళ్లు దెబ్బతినే ప్రాంతాల్లో గ్రోయెన్లు, రివిట్‌మెంట్‌ నిర్మాణాల కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లంక గ్రామ వాసుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనలంక రామాల­యం­పేట, లంకాఫ్‌ ఠానేల్లంక రామాలయంపేట, అయినవిల్లి మండలం కొండుకుదురులంకలోని తొత్తరమూడివారిపేటలో నదీ కోత తీవ్ర­తను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలె­క్టర్‌ హిమాన్షు శుక్లా, ముమ్మిడివరం, పి.గన్నవరం ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్, కొండేటి చిట్టిబాబులు కోత తీవ్రత గురించి సీఎంకు వివరించారు. ఈ ప్రాంతంలో గ్రోయెన్లు, రివిట్‌­మెంట్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు.  బాధి­తుల ఇళ్ల వద్దకు వెళ్లిన సమయంలో. బహిరంగంగా వారితో మాట్లాడినప్పుడు పలువురు ఇదే సమస్యను ప్రస్తావించారు. దీనిపై కూనలంకలో సీఎం జగన్‌.. అప్పటికప్పుడే స్పందిస్తూ ఆరు గ్రామాల్లో కోతకు పరిష్కారం చూపేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

జనం నివాసముండే ఆవాస ప్రాంతాల్లో సుమారు 3.5 కిలోమీటర్ల మేర బిట్లు బిట్లుగా గ్రోయెన్ల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. పొట్టిలంకలో వెయ్యి మీటర్లు, కొండుకుదురులంక వద్ద 400 మీటర్లు, వివేకానంద వారధి వద్ద 300 మీటర్లు, లంకాఫ్‌ ఠానేల్లంకలో 400 మీటర్లు, కూనలంక వద్ద 800 మీటర్లు, గురజాపులంక వద్ద 600 మీటర్లు చొప్పున నిర్మిస్తామని చెప్పారు.

ప్రజల సమక్షంలోనే ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీరు సతీష్‌తో మాట్లాడారు. ఎప్పటికి పూర్తి స్థాయిలో అంచనాలు తయారు చేస్తారని ప్రశ్నించారు. అంచనాలు పూర్తి చేసి, నెలాఖరు నాటికి టెండర్లు పూర్తి చేయాలని, ఆ తర్వాత నెల రోజులకు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పనులు మొదలైన తర్వాత కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌లు తనకు ఫొటోలు పంపాలని ఆదేశించారు. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)