Breaking News

వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు 

Published on Mon, 03/11/2024 - 02:45

పి.గన్నవరం: సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు జరిగిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయన అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.36 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని కొనియాడారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏపీజీఈఎఫ్‌) వైస్‌ చైర్మన్‌ విప్పర్తి నిఖిల్‌ కృష్ణ ఆధ్వర్యాన ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో మూడు రోడ్ల సెంటర్‌ నుంచి దుర్గమ్మ గుడి వరకూ వివిధ శాఖల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఉద్యోగులకు అండగా నిలిచి, గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసినందుకు ‘థాంక్యూ సీఎం సార్‌’ అంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ఆర్థిక శాఖ అధికారులు వద్దన్నా కొత్త పీఆర్‌సీ ప్రకారం పే స్కేల్‌ అమలు చేశారన్నారు. అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను సీఎం జగన్‌ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్న ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ‘మన ప్రభుత్వం – మన ప్రగతి’ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)