Breaking News

వీఆర్‌ఏలకు శుభవార్త

Published on Fri, 09/01/2023 - 04:46

సాక్షి, అమరావతి : విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ)లకు డీఏ పెంచుతూ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో వీఆర్‌ఏలకు రూ.300 ఉన్న డీఏను చంద్రబాబు ప్రభుత్వం రద్దుచేయడంతో దీన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (ఏపీజీఈఎఫ్‌) సీఎంను కలిసి కోరగా తక్షణం సానుకూలంగా స్పందించినట్లు ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

దీనికి సంబంధించిన ఫైల్‌ సర్క్యులేట్‌ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించడమే కాక అందులో డీఏను రూ.300 నుంచి రూ.500కు పెంచుతూ సీఎం సంతకం చేసినట్లు తెలిపారు. డీఏను పునరుద్ధరించడంతోపాటు దానిని పెంచుతూ ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకోవడంపట్ల వీఆర్‌ఏలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

ఈ నిర్ణయంవల్ల సుమారు 20,000 మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక వీరికి డీఏ మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర రెవెన్యూ శాఖాధికారులకు ఏపీజీఈఎఫ్‌ తరఫున వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
వీఆర్‌ఏలకు గతంలో కేవలం రూ.300గా ఉన్న డీఏను నేడు రూ.500కు పెంచే ఫైలును ఆమోదించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి పక్షాన బొప్పరాజు, పలిశెట్టి దామోదర్‌రావు, చేబ్రోలు కృష్ణమూర్తిలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ సమస్యపై ముఖ్యమంత్రికి సిఫార్సు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.

గత ప్రభుత్వం వీఆర్‌ఏల డీఏను రద్దుచేస్తే ఈ ప్రభుత్వం పునరుద్ధరించడమే కాక.. రూ.300 నుంచి రూ.500కు పెంచడంపై ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్‌ వాసా దివాకర్, ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలనాయుడులు కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌