Breaking News

ఉప్పాల రాంప్రసాద్‌ పార్థీవదేహానికి సీఎం జగన్‌ నివాళులు

Published on Sun, 06/18/2023 - 13:55

సాక్షి, కృష్ణా జిల్లా: పెడన మండలం కూడూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. అనారోగ్యంతో కన్నుమూసిన వైఎస్సార్‌సీపీ నేత ఉప్పాల రాంప్రసాద్‌ పార్థీవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.. అనంతరం కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు.

కృష్ణాజిల్లాకు చెందిన ఉప్పాల రాంప్రసాద్‌ (68) అనారోగ్యంతో కన్నుమూశారు. పెడన మండలం కూడూరుకు చెందిన రాంప్రసాద్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌గా పనిచేశారు. అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. పెడన నియోజకవర్గంలో సీనియర్‌ రాజకీయ నాయకుడిగా టీడీపీ, వైఎస్సార్‌ సీపీల్లో పదవులు నిర్వహించి ఆయన పెడన మండలంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

గతంలో టీడీపీ లీడర్‌గా ఉన్న ఆయన వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం సందర్భంగా ఆ పార్టీ చేరి పెడన నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన అంకిత భావానికి, సేవలకు మెచ్చిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 2014లో కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఒటమి పాలయ్యారు. అనంతరం పార్టీకి చేస్తున్న సేవలకు గుర్తింపుగా సీఎం జగన్‌ రాంప్రసాద్‌ కోడలు ఉప్పాల హారికను కృష్ణాజిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా నియమించారు. రాంప్రసాద్‌ అకాల మరణం పెడన నియోజకవర్గానికి తీరని లోటని పలువురు పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.
చదవండి: నాడు భయం భయం.. నేడు భద్రతకు భరోసా

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)