Breaking News

ఆసియా క్రీడల్లో సత్తా చాటారు 

Published on Sat, 10/21/2023 - 03:30

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి (చెస్‌), జ్యోతి యర్రాజీ (అథ్లెట్‌), బి.అనూష (క్రికెట్‌) శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.

ప్రపంచ క్రీడా వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతూ రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చారని సీఎం జగన్‌ వారిని అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు తాము గెలుచుకున్న పతకాలను సీఎంకు చూపించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేలా క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.   

ఏపీకి 11 పతకాలు.. 
ఆసియా క్రీడల్లో మన దేశం తొలిసారిగా 107 పతకాలను సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 13 మంది క్రీడాకారులు దేశం తరఫున వివిధ క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఎనిమిది మంది క్రీడాకారులు 11 పతకాలను (5 గోల్డ్, 6 సిల్వర్‌) సాధించారు. రాష్ట్ర స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం ఆసియా క్రీడల్లో పతకాల విజేతలకు ప్రభుత్వం రూ.2.70 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసింది.

వీటితో పాటు గతంలోని ప్రోత్సాహక బకాయిలతో కలిపి మొత్తం రూ.4.29 కోట్లు క్రీడాకారుల ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్విసులు, క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఎండీ హెచ్‌.ఎం.ధ్యానచంద్ర, శాప్‌ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)