Breaking News

జనాభా ఆధారంగా పంచాయతీల వర్గీకరణ

Published on Thu, 07/17/2025 - 05:33

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన గ్రేడ్ల వారీగా వర్గీకరించంలో భాగంగా పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ వీఆర్‌ కృష్ణతేజ మైలవరపు శుక్రవారం పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం వార్షిక రాబడి ప్రకారం పంచాయతీలు 5 రకాలుగా ఉన్నా­యి. కానీ వార్షిక రాబడితో పాటు జనాభా సంఖ్య ఆధారంగా పంచాయతీలను వర్గీకరించేందుకు ప్రభుత్వం జనవరిలో అధికారుల కమిటీని ఏర్పా­టు చేసింది. ఆ కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. పది వేలకు పైగా జనాభా లేదంటే ఏడాదికి రూ.కోటికి పైగా వార్షికాదాయం ఉండే వాటిని స్పెషల్‌ గ్రేడ్‌ పంచాయతీలుగా ప్రతిపాదించింది.

జనాభా, రాబడి ఆధారంగా గ్రేడ్‌–1,2,3 పంచా­య­తీలుగా వర్గీకరించాలని సిఫార్సులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 350 స్పెషల్‌ పంచాయతీలు­గా గుర్తించాలని నిర్ణయించింది. మరో 2,400 గ్రేడ్‌–1 కేటగిరిలో, 4,200 గ్రేడ్‌–2లో, మిగిలిన వాటిని గ్రేడ్‌–3 కేటగిరిలో కొనసాగించాలని కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న 5 రకాల గ్రేడ్‌ పం­చాయతీలకు.. 5 రకాల గ్రేడ్‌ల పంచాయతీ కా­ర్యదర్శులున్నారు. వారిని ప్రస్తుత ప్రతిపాదనలకు అనుగుణంగా మార్చేందుకు శుక్రవారం జరిగే సమావేశంలో అభిప్రాయాలు సేకరించనున్నారు. 

పంచాయతీ కార్యదర్శుల విభజన ఇలా..
» ప్రసుత్తం గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, గ్రేడ్‌–3, గ్రేడ్‌–4, గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
» కొత్తగా ఏర్పాటు చేసే స్పెషల్‌ గ్రేడ్‌ పంచాయతీ­లకు ప్రస్తుత గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శుల నుంచి సీనియారిటీ ప్రాతిపదికన పదో­న్న­తులు కల్పించాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు. లేదంటే డిప్యూటీ ఎంపీడీవోలను స్పెష­ల్‌ గ్రేడ్‌ పంచాయతీలకు నియమించే ఆలోచన చేస్తున్నారు. 
»  గ్రేడ్‌–1 కార్యదర్శులను కొత్తగా ఏర్పాటయ్యే గ్రేడ్‌–1 కేటగిరిలో కొనసాగించాలని భావిస్తున్నారు.
» జోనల్‌ కేడర్‌లో ఉన్న గ్రేడ్‌–2, జిల్లా కేడర్‌లో ఉన్న గ్రేడ్‌–3 కార్యదర్శులను కొత్త జోనల్‌ కేడర్‌లోని గ్రేడ్‌–2 కార్యదర్శులుగా.. జిల్లా కేడర్‌గా ఉ­న్న గ్రేడ్‌–4, గ్రేడ్‌–5 కార్యదర్శులను కొత్త  జిల్లా కేటగిరిలోని గ్రేడ్‌–3 కార్యదర్శులుగా కొనసాగించేందుకు కసరత్తు చేస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)