Breaking News

AP: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

Published on Mon, 03/17/2025 - 05:23

సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు (3.15 గంటలు) పరీక్ష ఉంటుంది. చివరి పరీక్షను రంజాన్‌ సెలవు ఆధారంగా ఈ నెల 31 లేదా ఏప్రిల్‌ ఒకటో తేదీన నిర్వహిస్తారు. 2024–25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. 

రెగ్యులర్‌ విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది, ఉర్దూలో 2,471 మంది, హిందీలో 16 మంది, కన్నడలో 623 మంది, తమిళంలో 194 మంది, ఒడియాలో 838 మంది పరీక్షలు రాసేందుకు ఎన్‌రోల్‌ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. వాటిలో 163 సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. 

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. హాల్‌టికెట్‌ చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్ష సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ కొనసాగుతుందని పదో తరగతి పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఇన్విజిలేటర్లతోపాటు సెంటర్లలో విధులు నిర్వర్తించే పోలీసులు, ఏఎన్‌ఎంలతో సహా ఎవరూ ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లకూడదని స్పష్టంచేసింది. 

ఈ పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 156 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ను నియమించింది. జిల్లా స్థాయి కంట్రోల్‌ రూమ్‌తోపాటు రాష్ట్రస్థాయిలో ఎస్‌ఎస్‌సీ డైరెక్టరేట్‌లోను ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ అందుబాటులో ఉంటుంది. పరీక్షలపై ఫిర్యాదుల కోసం 0866–2974540 నంబర్‌ను కేటాయించారు.  

ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు కూడా నేటి నుంచే.. 
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి (ఓపెన్‌ టెన్త్‌) పరీక్షలు కూడా సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. రెగ్యులర్‌ పరీక్షలు జరిగే తేదీలు, సమయాల్లోనే ఈ పరీక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు ఈ నెల 28వ తేదీతో ముగియనున్నాయి. ఈ పరీక్షలకు 30,334 మంది హాజరుకానున్నారు. వీరికోసం 471 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.  

AP: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)