Breaking News

టాటా, గున్నీ ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టేయండి

Published on Sun, 12/01/2024 - 03:54

సాక్షి, అమరావతి : సినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యా­దు మేరకు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఐపీఎస్‌ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్‌ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని సీఐడీ హైకో­ర్టును అభ్యర్థించింది. ఈమేరకు సీఐడీ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఎస్‌పీ సరిత వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. 

వారికి ముందస్తు బెయిల్‌ ఇస్తే సాక్షులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆ కౌంటర్లలో హైకోర్టును సీఐడీ కోరింది. కుక్కల విద్యా­సాగర్‌తో కలిసి కుట్రలో పాల్గొనడం ద్వారా పోలీసు మాన్యువల్‌ ఆర్డర్‌ను ఉల్లంఘించారని చెప్పింది. ఈ కుట్రలో న్యాయవాది వెంకటేశ్వర్లు సైతం పాలుపంచుకున్నారని తెలిపింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్‌ 2న చేపట్టనుంది.

విద్యాసాగర్‌కు బెయిల్‌ ఇవ్వొద్దు..
జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోరుతూ ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని సీఐడీ హైకోర్టును కోరింది. విద్యాసాగర్‌ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది. ఈ మేరకు సీఐడీ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)