Breaking News

‘కాల్చిపారేస్తా.. కొడకల్లారా!’

Published on Wed, 08/27/2025 - 04:55

ఒంగోలు, టాస్క్‌ఫోర్స్‌: కోర్టులో వివాదం నడుస్తున్నా.. పచ్చనేత ఆదేశంతో 20 ఏళ్ల క్రితం నిర్మించిన రచ్చబండను పోలీసులు రాత్రికి రాత్రే కూల్చేశారు. ఇదేమిటని నిలదీసిన గ్రామస్తులపై సీఐ సోమశేఖర్‌ రెచ్చిపోయారు. తుపాకీ చూపిస్తూ ‘కాల్చిపడేస్తా నా కొడకల్లారా’ అంటూ బెదిరించారు. రచ్చబండ తొలగింపును అడ్డుకున్న గ్రామస్తులపై లాఠీచార్జి చేశారు. దీంతో మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం.. సర్వే నంబర్‌ 627లో 50 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలానికి 20 మంది హక్కుదారులుగా ఉన్నారు. స్థలంలో 20 ఏళ్ల క్రితం వేపచెట్టు చుట్టూ రచ్చబండ నిర్మించి గ్రామస్తులు ఉపయోగించుకుంటున్నారు. ఈ స్థల వివాదం హైకోర్టుకు చేరగా.. టీడీపీ సానుభూతిపరుడు మంత్రి స్వామిని ఆశ్రయించాడు. దీంతో మంగళవారం రాత్రి 30 మంది పోలీసులతో వచ్చిన సీఐ సోమశేఖర్‌ జేసీబీ సహాయంతో రచ్చబండను తొలగించారు.

అడ్డుకునే ప్రయత్నం చేసిన గ్రామస్తుల్ని సీఐ సోమశేఖర్‌ కాల్చిపారేస్తా నా కొడకల్లారా అంటూ పిస్టల్‌ చూపించి బెదిరించారు. మహిళలపై లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం రాగా.. గాయపడ్డ వారిని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి సీసీ కెమెరాను సైతం పోలీసులు పగులగొట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)