Breaking News

మాజీమంత్రి సీదిరిపై సీఐ బూతుపురాణం

Published on Mon, 05/26/2025 - 06:09

వజ్రపుకొత్తూరు రూరల్‌/వజ్రపుకొత్తూరు: టీడీపీ కూటమి పాలనలో పోలీసుల ఓవరాక్షన్‌ రోజు­రో­జుకీ శృతిమించుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌­­­సీపీ శ్రేణులు, నాయకులపట్ల ఇష్టారా­జ్యంగా ప్రవ­రి­్తస్తున్నారు. తాజాగా.. మాజీమంత్రి సీదిరి అప్ప­లరాజుపై కాశీబుగ్గ రూరల్‌ సీఐ తిరుపతిరావు దు­రుసుగా ప్రవర్తించి బూతు­పురా­ణం అందుకు­న్నా­రు. మాజీమంత్రి అని కూడా చూడకుండా ఆ­య­­­న­పై వేళ్లు చూపిస్తూ ‘తమాషా దె...’ అంటూ నో­టికొ­చ్చినట్లు దుర్భాషలాడారు. దీంతో శ్రీకాకు­ళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పోలీసు­స్టేషన్‌ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటు­చేసుకుంది. వివ­రాలివీ.. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన గూడ ధనరాజ్‌ ఇటీవల కురిసిన గాలివానకు పశువుల షెడ్‌ పాడైపోవడంతో మళ్లీ నిర్మించుకున్నాడు.

అయితే, గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు వ్యక్తిగత కక్షతో ఆయన భార్య లక్ష్మితో వాగ్వాదానికి దిగి దానిని కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో.. బాధితులు ప్రతిఘటించగా వారిపై దాడిచేశారు. ఈ విషయంపై బాధితులు పోలీసుల­ను ఆశ్రయించగా వారు స్పందించలేదు. అయితే, నిందితులు అంతకుముందే ఫిర్యాదు ఇవ్వడంతో బాధితులను పిలిచి రోజంతా స్టేషన్‌లో ఉంచారు. తమ గొర్రెలను అపహరించారని.. తాను వేసుకున్న షెడ్‌ను కూల్చడానికి యత్నించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించలేదని బాధితుడు వాపోయాడు.

విషయం తెలుసుకున్న మాజీమంత్రి సీదిరి అప్పలరాజు పోలీసుస్టేషన్‌కు వెళ్లి బాధితుల పక్షాన పోలీసు­లను నిలదీశారు. బాధితులిచ్చిన ఫిర్యాదును తీసుకుని రశీ­దు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో కాశీబుగ్గ రూర­ల్‌ సీఐ తిరుపతిరావు మాజీమంత్రిపట్ల దురు­సుగా ప్రవర్తించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాసేపటి తర్వాత బాధితుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా సీదిరి అప్పల­రాజు  మాట్లాడు­తూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడా­ల్సిన పోలీసులు టీడీపీ కూటమి నాయకుల­కు వంత పాడడం సరికాదని, అధికారం శాశ్వతం కాదనే  సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చ­రించి బాధితులకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. మరోవైపు.. సీఐ ప్రవర్తనపై స్థానిక మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)