Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు

Published on Tue, 12/26/2023 - 04:12

గుణదల (విజయవాడ తూర్పు)/కర్నూలు కల్చరల్‌/డాబాగార్డెన్స్‌ (విశాఖ)/ : ప్రపంచశాంతిని కాంక్షించిన శాంతిదూత.. కరుణామయుడు.. ఏసుక్రీస్తు జన్మించిన పర్వదినం పురస్కరించుకుని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చర్చిలన్నీ జనసంద్రంగా మారాయి. లక్షలాది మంది భక్తులు ప్రార్థనలతో పరవశించిపోయారు. ప్రభువు చూపిన మార్గంలో పయనించాలంటూ బిషప్‌లు, పాస్టర్లు సందేశాన్ని­చ్చారు.

ప్రసిద్ధ క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రం విజయ­వాడలోని గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో బాలయేసును దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పశువుల పాకలో పడుకోబెట్టిన బాలయేసు స్వరూపానికి సాగిలపడి మొక్కులు  చెల్లించుకున్నారు. పుణ్యక్షేత్ర రెక్టర్‌ ఫాదర్‌ యేలేటి విలియం జయరాజు భక్తులనుద్దేశించి మాట్లాడారు. సమిష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

అంబరాన్నింటిన సంబరాలు..
మరోవైపు.. విజయవాడ నగర వ్యాప్తంగా కూడా క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటాయి. పలు ప్రముఖ చర్చిల్లో సోమవారం ఉదయం సర్వమా­నవాళి సుఖ శాంతులతో ఉండేలా చూడాలని దైవకుమారునికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పటమట సెయింట్‌ పాల్‌ కథెడ్రల్‌ చర్చి, సెయింట్‌ పాల్స్‌ బసిలికా చర్చి, గాంధీజీ మున్సిపల్‌ హైస్కూల్‌ ఎదురుగా ఉన్న సెయింట్‌ పాల్‌ సెంటినరీ చర్చిలో తెల్లవారుజాము నుంచి ఆరాధనా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో విశ్వాసులు హాజ­రయ్యారు.

వన్‌టౌన్‌ తారాపేటలోని పురాతన సెయింట్‌ పీటర్స్‌ చర్చి, సెయింట్‌ పీటర్స్‌ లూథరన్‌ చర్చిలో ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక విశాఖ నగరంలోని సెయింట్‌ ఆంథోనీ చర్చి, ట్రినిటీ లూథరన్‌ చర్చి, జ్ఞానాపురం సెయింట్‌ పీటర్స్‌ రక్షణ­గిరి పునీత పేతురు చర్చి, బాప్టిస్ట్‌ చర్చిల్లో క్రిస్మస్‌ సంబరాలు ఘనంగా జరిగాయి. క్రీస్తు స్తుతి గీతాలు భక్తుల హృదయాలను పరవశింపజేశాయి. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న చర్చిల్లోనూ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.

కర్నూలులోని బిషప్‌ చర్చిలో రెవరెండ్‌ చౌరప్ప, సీఎస్‌ఐ చర్చిలో పాస్టర్‌ రెవరెండ్‌ వరప్రసాద్, కోల్చ్‌ చర్చిలో పాస్టర్‌ రెవరెండ్‌ అనిల్‌కుమార్‌ సామ్యేల్, రెవరెండ్‌ జీవన్‌రావు సందేశం వినిపించారు. యేసును గుండెల్లో నింపుకుని పొరుగు వారిని ప్రేమిస్తూ ఆపన్న సమయంలో చేతనైన సహాయ, సహకారాలందించడమే నిజమైన క్రిస్మస్‌ అన్నారు. నంద్యాలలోని హోలీక్రాస్‌ కెథడ్రల్‌ చర్చిలో బిషప్‌ రైట్‌ రెవరెండ్‌ ఐజక్‌ వరప్రసాద్, జోసెఫ్‌ బాబు, హోలీక్రాస్‌ కెథడ్రల్‌ పాస్టరేట్‌–2 (ఆల్‌సెయింట్‌ చర్చి)లో రెవరెండ్‌ విజయ్‌కుమార్, డీనరీ చైర్మన్‌ ఇమ్మానియేల్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)