Breaking News

కువైట్‌లో అన్నమయ్య జిల్లా వాసి ఆర్తనాదాలు

Published on Mon, 07/15/2024 - 07:58

వాల్మీకిపురం: ఎన్నో ఆశలతో కువైట్‌కు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి ఏజెంట్‌ చేతిలో మోసపోయాడు. ఎడారిలో తాను కష్టాలు పడుతున్నానని, కాపాడాలంటూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ‘ఎడారిలో మేకలు, గొర్రెలు, కుక్కలకు నేనొక్కడినే మేత వేస్తున్నా..నీళ్ల కోసం 2 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఎండలకు నా వల్ల కావడంలేదు. ఎవరైనా సాయం చేయండి.. లేదంటే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలు.. చిత్తూరు జిల్లా కల్లూరుకు చెందిన రామచంద్రరావ్‌ కుమారుడు శివ (40) అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం బోయపల్లికి చెందిన శంకరమ్మను 18ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి వెన్నెల, వనిత అనే కుమార్తెలు ఉన్నారు. శివ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు.

 బిడ్డలను చదివించలేని పరిస్థితి ఉండడంతో పెద్ద కుమార్తెతో పాటు భార్యను సైతం కూలీకి తీసుకెళ్లి వచ్చిన డబ్బుతో చిన్న కుమార్తె వనితను చదివిస్తున్నాడు. ఈ క్రమంలో కువైట్‌ వెళ్లి డబ్బు సంపాదించి పెద్ద కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పులు చేసి డబ్బులు పోగేసుకొని రాయచోటికి చెందిన ఏజెంట్‌ హైదర్‌ను సంప్రదించాడు. అతని ద్వారా శివ నెలక్రితమే కువైట్‌కు వెళ్లాడు. అక్కడ ఎడారిలో గొర్రెలు, పావురాలు, బాతులు మేపడానికి బాధితుడిని పెట్టారు. అయితే అక్కడ సంబంధిత యజమానులు నాలుగు రోజులైనా గొర్రెల దగ్గరికి రాకపోగా సరిపడా ఆహారం, నీటిని అందించకపోవడంతో బాధితుడు భయపడిపోయాడు. 

ఈ తరుణంలో తన భార్యకు, ఏజెంట్‌కు సమాచారం అందించాడు. తిరిగి రావడానికి డబ్బులు ఎవ్వరు ఇస్తారని, నువ్వు అక్కడే పని చేయాల్సిందేనని ఏజెంటు చెప్పడంతో తన దగ్గర డబ్బులు లేవని, భార్య నిస్పహాయత చూపడంతో బాధితుడు చేసేది ఏమీలేక తనకు చావే శరణ్యమని, తనను ఎవరైనా దయగలవారు ఇండియాకు తీసుకెళ్లాలని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ పోస్టును చూసిన ఎంబసీ వారు స్పందించారు. బాధితుడు శివను భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.

మా నాన్నను భారత్‌కు రప్పించండి
మా నాన్న శివ కువైట్‌కు వెళ్లాడు. అక్కడ ఎడారిలో ఉన్నాడు. దయచేసి ఎవరైనా సహాయం చేసి మా నాన్నను భారత్‌కు రప్పించండి.
– వనిత, బాధితుడి కుమార్తె

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)