Breaking News

మన్యంలో మంచుతెరలు

Published on Fri, 10/25/2024 - 05:51

సాక్షి, పాడేరు:మన్యంలో రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందస్తు చలిగాలుల వ్యాప్తితో మన్యం వాసులు ఉదయం, సాయంత్రం చలిబారిన పడుతున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా శీతాకాలం రాకముందే మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. 

చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం 16.5 డిగ్రీలు, గురువారం 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులుగా పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 18 డిగ్రీలు, అరకులోయ కాఫీ బోర్డులో 18.7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

దట్టంగా పొగమంచు
ఏజెన్సీలోని అన్ని ప్రాంతాల్లోనూ పొగమంచు దట్టంగా కురుస్తోంది. వేకువజామున ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. పొగమంచు తీవ్రతతో వాహన చోదకులు పగటిపూట కూడా హెడ్‌లైట్లు ఆన్‌ చేసుకుని వాహనాలు నడుపుతున్నారు. 

తుపాను ప్రభావంతోనే..
తుపాను కారణంగా ఏజెన్సీలో చలిగాలులు అధికమయ్యాయి. నవంబర్‌ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా చలితీవ్రత అధికంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిసెంబర్‌ నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపు పడిపోయే అవకాశం ఉంది. – డాక్టర్‌ అప్పలస్వామి, ఏడీఆర్, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)