Breaking News

పసితనంలోనే పలుపుతాడు

Published on Fri, 10/10/2025 - 04:39

బాల్య వివాహాలతో చిన్నారులు అనారోగ్యం బారిన పడతారు.  పలు అనర్థాలకు దారి తీస్తాయి. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండితేనే వివాహం చేయాలనేది నిబంధన. ఆ వయసు నిండకుండా చేయడం నేరం. బాధ్యులపై గరిష్టంగా రెండేళ్లు జైలు, రూ. లక్ష వరకు జరిమానా లేదా రెండు అమలు చేసే వీలుంది. అయితే, ఇటీవల తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది.  పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు చిన్న వయసులోనే వివాహం చేసి బరువు దించేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో  కొందరు, ప్రేమ పెళ్లిళ్లనే భయంతో మరికొందరు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు.

సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో బాల్య వివాహాలు అత్యధికంగా జరుగుతున్నాయి. 2024 జనవరి నుంచి 2025 ఆగస్టు వరకు 109 బాల్య వివాహాలను స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకున్నారు. కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా హామీ (బైండోవర్‌ లెటర్‌) తీసుకున్నారు. అయినా, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. ఇలా అధికారుల ఆదేశాలు ధిక్కరించి మూడు బాల్య వివాహాలు జరగడంతో వారిపై పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. సత్తెనపల్లిలోని ధోబీఘాట్‌లో  ఆగస్టు 3న బాల్య వివాహం జరిగింది.

దీనిపై చైల్డ్‌ వెల్ఫేర్‌ కేర్‌కు ఫిర్యాదు కూడా వచ్చింది. విషయాన్ని గత నెల 23న చైల్డ్‌ వెల్ఫేర్‌ కేర్‌ ప్రతినిధి యర్రసాని ప్రశాంత్‌ కుమార్‌ సత్తెనపల్లి 4వ సచివాలయ అడ్మిన్‌ సెక్రటరీ గరికె కల్పన దృష్టికి తెచ్చారు. దీనిపై ఆమె విచారణ చేయడంతో వాస్తవమే అని తేలింది.   వధూవరులతో పాటు ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు, వివాహం జరిపిన పూజారి, కల్యాణ మండపం నిర్వాహకుడు, ఫొటోగ్రాఫర్‌.. ఇలా మొత్తం 14 మందిపై బాల్య వివాహ చట్టం కింద పట్టణ ఎస్‌ఐ పవన్‌ కుమార్‌ కేసు నమోదు చేశారు.  

బాల్య వివాహంతో దుష్ఫలితాలు... 
⇒ చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల ప్రసవ సమయంలో శిశువు మరణించడం లేదా తీవ్ర అనారోగ్య సమస్యలతో పుట్టే ప్రమాదం ఉంది. 
⇒ గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువ 
⇒  రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది 
⇒ పోషకాహార లోపం, రక్తహీనత తదితర సమస్యలు ఎదురవుతాయి 
⇒ వివాహం తరువాత చదువుకునే అవకాశం లేకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయి

బాల్య వివాహాలతో అనర్థం  
బాల్య వివాహాలతో అనర్థాలే ఎక్కువ. గర్భం దాల్చిన బాలికలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. బిడ్డను మోసే సామర్థ్యం వారికి తక్కువగా ఉంటుంది. చిన్న వయసులో గర్భం దాలిస్తే బిడ్డతో పాటు తల్లి ప్రాణానికీ ప్రమాదమే. ఒకవేళ బిడ్డ జని్మంచినా బరువు తక్కువగా ఉండడం, అనేక అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.    – డాక్టర్‌ బి.రవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, పల్నాడు 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)